Gold Rate Today : పసిడి ప్రియులకు ఊరట.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
- Harishth Thanniru
- Published On : March 15, 2024 / 10:45 AM IST
Gold
Gold And Silver Price Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. గతవారం ఆకాశమే హద్దుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర.. ఈ వారం కాస్త శాంతించింది. అయితే, గురువారం మరోసారి ధర పెరగ్గా.. శుక్రవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను జూన్ సమీక్షలో తగ్గిస్తుందన్న సంకేతాల నడుమ బంగారం రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు వెండిధరసైతం స్థిరంగా కొనసాగుతుంది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,610 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,120 మార్క్ కు చేరింది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 66,110.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,600 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,110.
చెన్నైలో బంగారం ధర రూ. 100 తగ్గింది. అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,250 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.66,820 వద్ద కొనసాగుతుంది.
- స్థిరంగా వెండి ధర ..
దేశం వ్యాప్తంగా వెండిధర స్థిరంగా కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాలను ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,000 మార్క్ కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 80,000 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.77,000 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.75,500 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
