Gold Rate : శ్రీరామనవమి రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంతో తెలుసా? తగ్గిన వెండి ధర
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
- Harishth Thanniru
- Published On : April 17, 2024 / 12:50 PM IST
Gold
Gold Rate in Hyderabad : గోల్డ్ రేటు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్వోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించవచ్చునన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాల వేళ పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, శ్రీరామనవమి రోజున (బుధవారం) బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ. 90,000 వద్ద కొనసాగుతుంది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,950 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,130 మార్క్ కు చేరింది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,280.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,950 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,130.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.75,050.
- తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,000 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 90,000. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.86,500 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో మాత్రం వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 85,600 వద్దకు చేరింది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
