Gold Rate : పది రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలుసా?.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తులం బంగారం ధర ఎంతంటే..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..
- Harishth Thanniru
- Published On : April 21, 2024 / 11:02 AM IST
Gold
Gold Rate in Hyderabad : కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా బంగారం ధర పెరుగుతుంది. గడిచిన పది రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ. 2వేలు పెరిగింది. శనివారం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఆదివారం స్థిరంగా కొనసాగుతుంది. దీంతో గత కొద్దిరోజులగా ధర పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్న బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించినట్లయింది. మరోవైపు వెండి ధరను పరిశీలిస్తే.. ఆదివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,050 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,240 వద్దకు చేరింది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,210 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,390.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,050 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,240.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,850 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.75,110.
- స్థిరంగా వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 90,000. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.86,500 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ. 250 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 86,000 వద్దకు చేరింది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
