Gold Rate Today : మూడు రోజులుగా అవే ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : January 24, 2024 / 07:53 AM IST
Gold Rate
Gold And Silver Prices Today : బంగారం కొనుగోలుదారులకు ఊరట లభిస్తుంది. గత మూడ్రోజులుగా గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయంగా నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం ఉదయం 6గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050గా నమోదైంది. వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 76,500 గా నమోదైంది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050గా నమోదైంది. వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 76,500 వద్ద కొనసాగుతుంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,200 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050 వద్ద కొనసాగుతుంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,300 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,600గా నమోదైంది.
- తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గుదల చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,500 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,500కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.75,000కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,000 వద్ద కొనసాగుతోంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
