Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Published On : December 24, 2023 / 07:09 AM IST
Gold
Gold And Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూసే. ఎందుకంటే.. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, మళ్లీ బంగారం ధర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60వేల మార్క్ ను తాకేలా కనిపిస్తోంది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 260 పెరిగింది. వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,200కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,490 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,640.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490 మార్క్ తాకింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.150 పెరగ్గా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.540 పెరిగింది. దీంతో ఇక్కడ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,750 కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.64,090గా నమోదైంది.
తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆదివారం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.79,000కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.77,000 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
