Gold Price Today : బంగారం కొనుగోలు దారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Updated on- December 28, 2023 / 09:45 AM IST
Gold
Gold And Silver Prices Today : బంగారం ధర పరుగులు పెడుతోంది. రికార్డు స్థాయి ధరవైపు దూసుకెళ్తోంది. గడిచిన పదిరోజుల్లో తులం బంగారంపై సుమారు రూ. 1300 పెరిగింది. రానున్నరోజుల్లోనూ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 60వేల మార్కును చేరే అవకాశాలున్నాయి. అయితే, గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,500కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,820 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,960.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,820 మార్క్ తాకింది.
– చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.59,000కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.64,360గా నమోదైంది.
స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గురువారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,700 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 87,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.79,200కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.77,000 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
