Gold Rate : బంగారం ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..
- Harishth Thanniru
- Published On : April 2, 2024 / 11:20 AM IST
Gold Rate
Gold Rate in Hyderabad : బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్వోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో గోల్డ్ కు డిమాండ్ పెరిగింది. దీనికితోడు చైనా నుంచి డిమాండ్ పెరగడమూ బంగారం పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. సోమవారం భారీగా పెరిగిన బంగారం ధర మంగళవారం కాస్త శాంతించింది. ఇవాళ 10గ్రాముల బంగారంపై రూ. 250 తగ్గింది. మరోవైపు వెండిధర పెరిగింది. కిలో వెండిపై రూ. 400 పెరిగింది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,350 మార్క్ కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,110 వద్దకు చేరింది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,260.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 63,350 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,110.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.64,300 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.70,150కు చేరింది.
- పెరిగిన వెండి ధర ..
దేశం వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.82,000 మార్క్ కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 82,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.79,000 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.79,000 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు
