Gold And Silver Rates Today : పండుగ వేళ మహిళలకు శుభవార్త.. భారీగా పతనమైన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే?
Gold And Silver Rates Today : ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర భారీగా తగ్గగా.. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
- Harish Thanniru
- Updated on- September 14, 2026 / 12:35 PM IST
Gold And Silver Rates Today
Gold And Silver Rates Today : వినాయక చవితి (Ganesh Chaturthi) పండుగ రోజుల మహిళలకు భారీ శుభవార్త (Good News). బంగారం ధర (Gold Rate) భారీగా పతనమైంది. శనివారం పెరిగిన గోల్డ్ రేటు.. ఇవాళ (సోమవారం) తగ్గింది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 490 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 25డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,328 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. దేశంలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,240 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,400 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
