Gold Price Today : బంగారం రేట్లు బ్లాస్ట్.. రాత్రికి రాత్రే రూ.6000 జంప్.. ఈ రోజు ధరలు చూస్తే మైండ్ బ్లాంకే..
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర
- Harishth Thanniru
- Published On : November 13, 2025 / 10:39 AM IST
Gold Price Today
Gold Price Today : బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి షాకింగ్ న్యూస్. వీటి ధరల్లో రాత్రికిరాత్రే భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా కిలో వెండి రేటు మళ్లీ రూ.2లక్షలకు చేరువవుతుండగా.. బంగారం ధర రూ.లక్షన్నరవైపు దూసుకెళ్తోంది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.2,290 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 2,100 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 100 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,207 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.9వేలు పెరిగింది. కాగా, సోమవారం నుంచి నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ.17వేలు పెరిగింది.
బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణ అనిశ్చితి, సెంట్రల్ బ్యాంక్ డైవర్సిఫికేషన్, ఈటీఎఫ్ ఇన్ ఫ్లోలు, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి అంశాలు ధరలే పెరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,27,800కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,300కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,27,950కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,150 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,27,950కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,82,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,72,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,82,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
