Gold Rate : ఒక్కరోజే రూ.9వేలు..! ఇదేం దూకుడురా బాబోయ్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏకంగా రూ.2లక్షలకు..
Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర
- Harishth Thanniru
- Published On : November 29, 2025 / 11:20 AM IST
Gold Price Today
Gold Rate Today : దేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోమని అడిగితే.. చాలా మంది నాకు పది కిలోల బంగారం.. పది కిలోల వెండి ఇవ్వు సామీ అనేస్తారు. ఎందుకంటే బంగారం, వెండి ధరలు ఆ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఒక్కరాత్రిలోనే గోల్డ, సిల్వర్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1360 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1250 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే గోల్డ్ రేటు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు దూసుకెళ్తోంది. ఔన్సు గోల్డ్ పై 63 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,219 డాలర్లకు చేరుకుంది.
ఇక వెండి ధర చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమే హద్దుగా వెండి ధర దూసుకెళ్తోంది. కిలో వెండిపై శనివారం రూ.9వేలు పెరిగింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ.21వేలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2లక్షల మార్క్ కు చేరువలో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,19,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,29,820కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,150 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,29,970కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,750 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,28,460కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,92,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,85,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,92,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
