Gold Rate Today : సిల్వర్ షాక్.. పసిడి పరుగులు.. ఒక్కరోజే 6వేలా..! ఇవాళ్టి ధరలు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
Today Gold Rate : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.
- Harishth Thanniru
- Published On : September 27, 2025 / 11:44 AM IST
Gold Rate Today
Today Gold Rate : దేశంలో బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. రెండుమూడు రోజులు తగ్గినట్లే తగ్గిన ధరలు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 600 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.550 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 20డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,759డాలర్ల వద్ద కొనసాగుతుంది.
మరోవైపు వెండి రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇవాళ కిలో వెండిపై ఏకంగా రూ.6వేలు పెరిగింది. గడిచిన తొమ్మిది రోజుల్లో కిలో వెండి రేటు రూ.18వేలు పెరిగింది. దీంతోప్రస్తుతం దేశంలో కిలో వెండి రేటు రూ.1లక్ష 59వేలకు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,05,850 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,15,480కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,15,630కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,05,850 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,15,480కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.6వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,59,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,49,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,59,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
