Gold Price Today : ఓవర్ నైట్ షాక్.. బంగారం రేట్లు ఒక్కసారిగా ఢమాల్.. కొనేవాళ్లకు లక్కీ టైమ్.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

Gold Price Today March 21 : బంగారం ప్రియులకు పండగే. మహిళలు బంగారం కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ఎంత తగ్గిందంటే?

1/10
Gold Price Today March 21 : బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. రోజురోజుకీ తగ్గుతూనే ఉన్నాయి. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
2/10
కొంటే ఇప్పుడే బంగారం కొనేసుకోవడం బెటర్. ముఖ్యంగా మహిళలు బంగారం కొనేందుకు అద్భుతమైన సమయం.
3/10
ఒకవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా బంగారం ధరలు మాత్రం దిగొస్తూనే ఉన్నాయి. శనివారం (మార్చి 21)న కూడా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గత రెండు రోజులుగా గోల్డ్ కాస్తా పెరిగినట్టు కనిపించినా మళ్లీ పతనమైంది.
4/10
శనివారం ఏకంగా బంగారం రూ. 2,940 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం..
5/10
ఈరోజు బంగారం ధరల్లో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం రూ. 2,940 తగ్గితే, కిలో వెండి ధర మాత్రం ఈ రోజు ఏకంగా రూ. 10వేలు తగ్గింది. దాంతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
6/10
ఈరోజు ఉదయం బులియన్ మార్కెట్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,45,970గా ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,33,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
7/10
తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే మాదిరిగా తగ్గాయి. వెండి ధర కూడా రూ. 10వేలు తగ్గింది.
8/10
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ధర రూ. 1,46,120 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,950 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,45,970 వద్ద ట్రేడ్ అవుతోంది.
9/10
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే చెన్నై నగరంలో కూడా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,48,580 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
10/10
వెండి ధరల విషయానికి వస్తే.. వెండి కూడా బంగారం మాదిరిగానే తగ్గుతోంది. శనివారం నాడు కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.10వేలు తగ్గింది. ఉదయం 11గంటల మధ్య రూ.10వేలు తగ్గి మొత్తంగా 2 లక్షల 50వేలకు చేరింది.