×
Ad

Gold Price Today : గోల్డ్ మార్కెట్‌లో భారీ ట్విస్ట్.. భారీగా పతనమైన పసిడి, వెండి ధరలు, ఏపీ, తెలంగాణలో ఈరోజు గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Price Today : బంగారం ప్రియులకు బంగారం లాంటి న్యూస్.. పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. పెళ్లి సీజన్‌లో బంగారం కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ధర ఎంత ఉంది? వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

1/11
Gold Price Today : బంగారం కొనేవారికి భారీ గుడ్ న్యూస్. హోలీ తర్వాత బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొన్నిరోజులుగా పసిడి ధరలు పతనమవుతున్నాయి. అందులోనూ పెళ్లి సీజన్ కావడంతో బంగారం కొనేవారికి అద్భుతమైన సమయం.
2/11
మార్చి 5 గురువారం కూడా బంగారం ధరలు మరోసారి తగ్గాయి. రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,63,680కి చేరుకుంది. ముంబైలో, ధర 10 గ్రాములకు రూ. 1,63,530కు చేరింది.
3/11
రాయిటర్స్ ప్రకారం.. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావంతో మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారానికి ఫుల్ డిమాండ్ పెరిగింది.
4/11
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు 0.8 శాతం పెరిగి ఔన్సుకు 5,176.69 డాలర్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ డెలివరీకి సంబంధించి యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఒక శాతం పెరిగి ఔన్సుకు 5,186.30కి డాలర్లకు చేరుకుంది.
5/11
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గాయి. హైదరాబాద్‌ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,63,560 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చి 4న బంగారం ధర రూ.1,64,510 వద్ద స్థిరపడగా ఈరోజు రూ.980 తగ్గింది.
6/11
22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,49,900 వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం ధర రూ.1,50,800 వద్ద స్థిరపడగా ఈరోజు రూ.900 తగ్గింది.
7/11
హైదరాబాద్‌లో బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 16,353, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 14,990 ఉండగా, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 12,265 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి.
8/11
ప్రస్తుతం చెన్నై నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,950 వద్ద కొనసాగుతుండగా బుధవారం రోజు రూ.1,65,820 వద్ద స్థిరపడింది. అంటే బంగారం ధర రూ.870 తగ్గింది.
9/11
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,200 వద్ద ట్రేడ్ అవుతుండగా బుధవారం రోజు బంగారం ధరలు రూ.1,52,200 వద్ద స్థిరపడ్డాయి.
10/11
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,63,530 వద్ద స్థిరపడగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,050 వద్ద ట్రేడ్ అవుతోంది.
11/11
వెండి విషయానికి వస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌ నగరంలోనూ కిలో వెండి ధర రూ.2.95 లక్షలు పలుకుతోంది. చెన్నైలోనూ వెండి ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి.