×
Ad

Gold Rate: బంగారం భగభగలు.. ఆల్‌టైమ్‌ హైకి పసిడి ధర.. హైదరాబాద్‌, విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయంటే? రూ.3,330 పెరిగి..

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,920గా ఉంది.

Gold Rate: భారత్‌లో ఇవాళ ఉదయం బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.3,330 పెరిగి రూ.1,32,770గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,050 పెరిగి రూ.1,21,700గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,500 పెరిగి రూ.99,580గా ఉంది.

Gold Prices

ఢిల్లీ, ముంబైలో..

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి రూ.1,32,920గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,050 పెరిగి రూ.1,21,850గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.3,330 పెరిగి రూ.1,32,770గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,050 పెరిగి రూ.1,21,700గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,500 పెరిగి రూ.99,580గా ఉంది.

భారీగా తగ్గిన వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ ఉదయం భారీగా తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.3,000 తగ్గి రూ.2,03,000గా ఉంది.

ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.4,000 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది.