Gold Rate Today: గోల్డ్ రేట్ తగ్గిందోచ్.. హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో బంగారం ధరలివే..
Gold Rate Decrease తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : November 12, 2025 / 10:30 AM IST
Gold Rate Decrease
Gold Rate Decrease: వరుసగా రెండ్రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు శాంతించాయి. గోల్డ్ రేటు తగ్గగా.. వెండి ధరల దూకుడు కొనసాగింది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.330 తగగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 300 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. నాలుగు డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,110 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర భారీగా పెరిగింది. సోమ, మంగళవారం వెండి ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 3వేలు పెరిగింది. దీంతో మూడ్రోజుల్లో కిలో వెండిపై రూ.8వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,510కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,200కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,25,660కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,510కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,73,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,63,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,73,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
