Today Gold Rate : బంగారం రేట్లు ఢమాల్.. ఈ రేంజ్ లో తగ్గడం ఇదే ఫస్ట్ టైమ్.. ఈ రోజు తులం ఎంతంటే..
Today Gold Rate తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
- Harishth Thanniru
- Published On : October 10, 2025 / 10:11 AM IST
Today Gold Rate
Today Gold Rate : బంగారం ప్రియులకు భారీ శుభవార్త. మీరు ఊహించని స్థాయిలో ఇవాళ గోల్డ్ రేటు (Gold Rate ) తగ్గింది. గత కొన్నిరోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధర.. ఇవాళ భారీగా తగ్గడంతో గోల్డ్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వెండి రేటు మాత్రం బిగ్ షాకిచ్చింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,860 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1,700 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ 4వేల డాలర్ల నుంచి దిగొచ్చింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 3,959 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
మరోవైపు.. వెండి ధర షాకిచ్చింది. ఇవాళ వెండి రేటు భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.3వేలు పెరిగింది. దీంతో కిలో వెండి రేటు రూ.2లక్షలకు చేరువులోకి దూసుకెళ్లి సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,12,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,22,290కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,22,440కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,12,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,22,290కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,80,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,70,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,80,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
