Gold Price Today : వార్నీ.. ఒక్కసారిగా మారిపోయిన బంగారం ధరలు.. డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయి.. నిపుణులు ఏం చెప్పారంటే?
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర
- Harishth Thanniru
- Published On : December 1, 2025 / 10:25 AM IST
Gold Price Today
Gold Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.660 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 600 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగానే పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 22 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,241 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి రేటు మరోసారి భారీగా పెరిగింది. ఇవాళ కిలో వెండిపై రూ.4వేలు పెరిగింది.
బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా భారీగా పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో 24క్యారట్ల బంగారంపై సుమారు రూ.3వేలు పెరిగింది. ఇక వెండి ధర చెప్పాల్సిన పనిలేదు. గత వారం రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ. 25వేలు పెరిగింది. దీంతో కిలో వెండి రూ.2లక్షల మార్కుకు చేరువలో ఉంది.
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. పెట్టుబడిదారుల్లో బంగారం మీద నమ్మకం పెరుగుతూ ఉంది. ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు ధ్రువీకరణ వస్తే డిసెంబర్ నెలలో కూడా బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,19,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30480కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,750 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,30,630కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,19,600 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,30480కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,96,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,89,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,96,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
