Gold Silver Prices Today: పండుగవేళ పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకోగా 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Silver Prices Today) మరోసారి రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.

Gold Silver Prices Today 5th November 2026 In Hyderabad Visakhapatnam Full Details

Gold Silver Prices Today: అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మార్పులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, పండుగల తదనంతర డిమాండ్ కారణంగా దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు కాగా, ధరలు రికార్డు స్థాయి వద్దనే నిలకడగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ఫ్యూచర్స్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవ్వడం, రూపాయి మారకం విలువలో వస్తున్న వ్యత్యాసాలు స్థానిక బులియన్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఆభరణాల తయారీదారులు, ఇన్వెస్టర్లు పసిడి ధరల గమనాన్ని నిశితంగా గమనిస్తున్నారు.

Voice Only Plans: మొబైల్ వినియోగదారులకు దీపావళి కానుక.. వాయిస్ ఓన్లీ ప్లాన్లు వచ్చేశాయ్.. రూ.149కే అన్‌లిమిటెడ్ టాక్‌టైమ్!

హైదరాబాద్‌లో బంగారం ధరలు.. కాస్త పెరిగిన 24, 22 క్యారెట్ల చార్జీలు:

ఈ ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర గ్రాముకు రూ.322 పెరిగి రూ.14,602 వద్ద విక్రయించబడుతోంది. దీంతో తులం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,020కు చేరింది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.295 పెరిగి రూ.13,385 వద్ద నిలిచింది. పర్యవసానంగా తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,33,580కి చేరుకుంది.

భగ్గుమంటున్న వెండి.. కిలో ఎంతంటే?

బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే స్థాయిలో స్థిరంగా, భారీ స్థాయి వద్ద కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. పారిశ్రామిక రంగానికి చెందిన డిమాండ్‌తో పాటు గ్లోబల్ విపణిలో డిమాండ్ పుంజుకోవడంతో ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ ట్రెండ్‌ ఆధారంగానే బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.