Gold-Silver Prices Today: బంగారం ప్రియులకు భారీ షాక్.. మళ్ళీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి(Gold-Silver Prices Today) ధరలు మళ్లీ పుంజుకోవడం ప్రారంభించాయి.
- V Santhosh Kumar
- Published on- October 9, 2026 / 10:47 AM IST
Gold Silver Prices Today 9 October 2026 In Hyderabad Visakhapatnam Full Details
Gold-Silver Prices Today: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకోవడం ప్రారంభించాయి. గత కొన్ని రోజులుగా పతనమవుతూ వచ్చిన పసిడి పరుగుకు ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి. యూఎస్ డాలర్ విలువ తగ్గడం, అమెరికన్ ట్రెజరీ ఈల్డ్స్ వరుసగా రెండో సెషన్‌లోనూ క్షీణించడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించే విలువైన లోహాల వైపు మళ్లీ తమ దృష్టిని సారిస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రన్.. ఔన్స్ పసిడి ఎంతంటే:
అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ (Gold-Silver Prices Today)ఫ్యూచర్స్ ధర ఔన్సుకు 4,197 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది మునుపటి ముగింపు ధర కంటే 40 డాలర్లు (0.96 శాతం) పెరుగుదలను నమోదు చేసింది. ఇంట్రాడే వర్తకంలో గరిష్ఠంగా 4,199 డాలర్లను, కనిష్ఠంగా 4,156 డాలర్లను తాకింది. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానాన్ని కఠినతరం చేసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు ఈ ధరల పెరుగుదలను కొంతవరకు పరిమితం చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరల వివరాలు:
శుక్రవారం బులియన్ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం మన దేశంలో పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,49,560 గా నమోదు కాగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ.1,37,090 వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధర రూ.2,44,900గా ట్రేడ్ అవుతోంది. రానున్న పండుగ సీజన్‌లో పసిడి కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
