Gold Silver Prices Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే?
బంగారం (Gold Silver Prices Today)కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త అందింది.
- V Santhosh Kumar
- Published on- July 7, 2026 / 11:40 AM IST
Gold Silver Rate Today 7 July 2026 In Hyderabad Visakhapatnam Full Details
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- పసిడి ప్రియులకు శుభవార్త ఊరట
- అంతర్జాతీయ కారణాలతో రేట్ల తగ్గింపు
Gold Silver Prices Today: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించడంతో, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం, అటు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం(Gold Silver Prices Today) ధరలు దిగొచ్చి కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. ఈమేరకు మంగళవారం ఉదయం 10:00 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల వారీగా పసిడి ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడలో ధరలు:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,45,260
(నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ. 1,360 తగ్గింది)
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,33,150
(నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ. 1,250 తగ్గింది)
హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక కారణాల వల్ల రానున్న రోజుల్లో ధరల్లో మరికొన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల పసిడి ప్రేమికులకు మంచి అవకాశంగా మారనుంది.
