Gold Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే?
బులియన్ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Silver Rates Today) స్వల్పంగా పెరిగాయి.
- V Santhosh Kumar
- Updated on- July 11, 2026 / 10:30 AM IST
Gold Silver Rates Today 10 July 2026 In Hyderabad Visakhapatnam Full Details
- బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి
- వెండి ధరలు కాస్త తగ్గాయి
- మార్కెట్ ఒడిదొడుకులతో ధరల్లో మార్పులు
Gold Silver Rates Today: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,32,400 వద్ద ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.1,44,440 మార్కు వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజుతో పోలిస్తే 10 గ్రాముల పసిడిపై సుమారు రూ.1,200 నుండి రూ.1,300 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read- ITMS: హైదరాబాద్ ట్రాఫిక్‌లో సరికొత్త విప్లవం.. AI కెమెరాలతో నిఘా.. వాహదారులకు బిగ్ అలర్ట్
మరోవైపు వెండి కొనాలనుకునే వారికి మాత్రం కాస్త ఊరట లభించింది. బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి (Gold Silver Rates Today)ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్, ఏపీ వ్యాప్తంగా కేజీ వెండి ధర దాదాపు రూ.2,23,060 నుండి రూ.2,45,000 మధ్య స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకులు, రూపాయి విలువలో మార్పుల ఆధారంగా ఈ ధరలు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు వెళ్లే ముందు స్థానిక జ్యువెలరీ దుకాణాల్లో లైవ్ ధరలను సరిచూసుకోవడం మంచిది.
