Gold Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం రేటు ఎంతంటే?
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు(Gold Silver Rates Today) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
- V Santhosh Kumar
- Published on- July 13, 2026 / 10:23 AM IST
Gold Silver Rates Today 13 July 2026 In Hyderabad Visakhapatnam Full Details
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- హైదరాబాద్‌లో పసిడికి ఊరట
- భారీగా పతనమైన వెండి రేట్లు
Gold Silver Rates Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు(Gold Silver Rates Today) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు తులం (10 గ్రాములు) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,330 గా నమోదైంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర తులము రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు తులం బంగారంపై దాదాపు రూ.500 వరకు మేర తగ్గుదల కనిపించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అక్కడ కూడా ఇవే ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలోని ప్రముఖ నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,300 వద్ద ట్రేడ్ అవుతోంది. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీల ఆధారంగా వివిధ నగరాల్లోని జ్యువెలరీ షోరూమ్‌లలో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కిలో వెండి ధరపై దాదాపు రూ.4,900 వరకు మేర తగ్గి, ప్రస్తుతం రూ.2,56,000 వద్ద కొనసాగుతోంది. వెండి ఆభరణాలు, వెండి వస్తువులు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. పసిడి ప్రియులు కొనుగోలు చేసే ముందు లైవ్ ధరలను ఒకసారి పరిశీలించుకోవడం ఉత్తమం.
