×
Ad

Google Pixel 10 : ఆఫర్ అదిరింది బ్రో.. గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Google Pixel 10 : కొత్త పిక్సెల్ ఫోన్ కావాలా? అమెజాన్‌లో అతి తక్కువ ధరకే గూగుల్ పిక్సెల్ 10 ధర తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ ఇలా పొందండి.

Google Pixel 10

Google Pixel 10 : పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ధర భారీగా తగ్గింది. గూగుల్ ప్రాసెసర్ అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో అతి తక్కువ ధరకే లభిస్తోంది. గూగుల్ ఔత్సాహికులైతే పిక్సెల్ 10 మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. అమెజాన్ ఈ పిక్సెల్  (Google Pixel 10) ఫోన్ కొనుగోలుపై కళ్లుచెదిరే డిస్కౌంట్‌ను అందిస్తోంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో పిక్సెల్ 10 ధర తగ్గింపు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌, 12GB ర్యామ్ వేరియంట్‌ అసలు ధర రూ.79,999 ఉండగా అమెజాన్‌లో రూ.68వేలకి ధరకు లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ పిక్సెల్ ఫోన్‌పై రూ.3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో పిక్సెల్ 10 ధర రూ.65వేలకి తగ్గుతుంది. ఈ పిక్సెల్ ఫోన్ ఇండిగో, అబ్సిడియన్, లెమన్‌గ్రాస్ ఫ్రాస్ట్ అనే 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఎమర్జెన్సీ క్రోమ్ సెక్యూరిటీ అప్‌డేట్ ఆగయా.. అర్జెంట్‌గా మీ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోండి!

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10లో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 3nm ప్రాసెస్ ఆధారంగా గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. పవర్‌విఆర్ డీఎక్స్‌టీ-48-1536 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

గూగుల్ పిక్సెల్ 10లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ 5x జూమ్ OISతో 10.8MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం పిక్సెల్ ఫోన్‌లో 10.5MP ఫ్రంట్ స్నాపర్ ఉంది. 4970mAh బ్యాటరీతో పాటు 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.