Google Pixel 10 Price : అమెజాన్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్.. పిక్సెల్ 10 ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్!

Google Pixel 10 Price : కొత్త గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ పిక్సెల్ 10పై కిర్రాక్ డిస్కౌంట్ అందిస్తోంది. ధర ఎంత తగ్గిందంటే?

Google Pixel 10 Price : అమెజాన్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్.. పిక్సెల్ 10 ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్!

Google Pixel 10 Price drops by over Rs 15,500 on Amazon

Updated On : November 14, 2025 / 3:58 PM IST

Google Pixel 10 Price : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. కొత్త గూగుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ధర రూ. 15,500కు పైగా తగ్గింది.

ఈ ఫ్లాగ్‌షిప్‌ పిక్సెల్ 10 ఫోన్ (Google Pixel 10 Price) భారత మార్కెట్లో రూ. 79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇటీవల లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ 10 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ పిక్సెల్ 10పై రూ.11,699 ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. ధర రూ.68,300కి తగ్గింది. అంతేకాదు.. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.4వేలు అదనపు డిస్కౌంట్‌ పొందవచ్చు. మీ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతి చౌకైన ధరకే.. డోంట్ మిస్!

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 4,970mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. పిక్సెల్ 10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల OLED స్క్రీన్‌ కలిగి ఉంది. ఇంకా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ పిక్సెల్ ఫోన్ మాక్రో ఫోకస్‌తో కూడిన 48MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్ 5× ఆప్టికల్ జూమ్‌ అందించే 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా కలిగి ఉంది.