Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతి చౌకైన ధరకే.. డోంట్ మిస్!

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ. 14,100 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

1/5Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా రూ. 14,100కు పైగా తగ్గింపు పొందవచ్చు. మీ పాత్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇదే అద్భుతమైన ఆప్షన్.
2/5Motorola Edge 50 Pro
ఈ మోటోరోలా ఫోన్ కలర్ డిస్‌ప్లే, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో వ్యూ, బ్యాటరీ టాప్-అప్‌ వంటి అద్భుతమైన ఆప్షన్లను పొందవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవని గమనించాలి. అమెజాన్‌లో ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
3/5Motorola Edge 50 Pro
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB వేరియంట్) రూ.35,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ.12,409 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ధర రూ.23,590కు తగ్గింది. అంతేకాదు.. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,769 అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. మీ సేవింగ్స్ కోసం మీ పాత హ్యాండ్‌సెట్‌ను ట్రేడ్ చేయవచ్చు.
4/5Motorola Edge 50 Pro
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. హుడ్ కింద, ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఇంకా, మోటోరోలా ఫోన్ 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని అందిస్తుంది.
5/5Motorola Edge 50 Pro
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలాగే, ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.