Google Pixel 9 Pro Price : అద్భుతమైన డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Google Pixel 9 Pro Price : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర భారీగా తగ్గింది. మీ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్.

Google Pixel 9 Pro Price
Google Pixel 9 Pro Price : గూగుల్ పిక్సెల్ ఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే ఫ్లిప్‌కార్ట్‌లో (Google Pixel 9 Pro Price) పిక్సెల్ 9 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
ఈ ఫ్రీడమ్ సేల్ సమయంలో అన్ని బ్యాంక్ ఆఫర్లతో రూ.24వేల కన్నా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఈ పిక్సెల్ ఫోన్ రూ.86వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. పిక్సెల్ 9 ప్రో ఫోన్ ఆకట్టుకునే పర్ఫార్మెన్స్, కెమెరా సెటప్, అద్భుతమైన డిస్‌ప్లే, ఏఐ ఫీచర్లతో క్లీన్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర :
ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 9 ప్రో రూ. 89,999 ధరకు లభిస్తోంది. అసలు ధర కన్నా రూ. 20వేలు భారీ తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా రూ. 4వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా ధర రూ. 85,999కి తగ్గుతుంది. నెలకు రూ. 3,625 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.
Read Also : BSNL Freedom Offer : BSNL ఫ్రీడమ్ ఆఫర్.. కేవలం రూ.1కే 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో బెనిఫిట్స్..
మీ పాత పిక్సెల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలని అనుకుంటున్నారా? వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా మీ ఫోన్‌తో ఈజీగా ఎక్స్ఛేంజ్ (రూ. 63,700 వరకు) పొందవచ్చు. గూగుల్ ఒక ఏడాది వారంటీని కూడా అందిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఎల్‌టీపీఓ OLEDతో వస్తుంది. హుడ్ కింద, ఈ పిక్సెల్ టెన్సర్ G4 చిప్‌సెట్, 16GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. 27W ఫాస్ట్ ఛార్జింగ్, కనీసం 12W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ పిక్సెల్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 48MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 42MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.