BSNL Freedom Offer : BSNL ఫ్రీడమ్ ఆఫర్.. కేవలం రూ.1కే 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో బెనిఫిట్స్..
BSNL Freedom Offer : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 1తో అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు.

BSNL Freedom Offer
BSNL Freedom Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 2025 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూజర్ల కోసం (BSNL Freedom Offer) రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కేవలం రూ.1 లేదా అంతకంటే ఎక్కువ ధరకే 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో సహా అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది.
అంతేకాకుండా, బీఎస్ఎన్ఎల్ యూజర్లు దేశవ్యాప్తంగా రోమింగ్ సర్వీసులను కూడా పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎంట్రీ-లెవల్ ప్యాక్‌లలో ఇదొకటి. లిమిటెడ్ టైమ్ ‘ఫ్రీడమ్ ఆఫర్’ అని కంపెనీ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఈ ప్లాన్ అందరి యూజర్లకు వర్తించదని గమనించాలి.
బీఎస్ఎన్ఎల్ రూ.1 ఆజాదీ కా ప్లాన్ వివరాలివే :
బీఎస్ఎన్ఎల్ రూ.1 ఆజాదీ కా ప్లాన్ ఆఫర్ కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఆసక్తిగల యూజర్లు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 మధ్య కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును కొనుగోలు చేయాలి. రీఛార్జ్ మొత్తం రూ.1తో ఈ ప్లాన్ అన్ని టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉంది.
బీఎస్ఎన్ఎల్ రూ.1 ఆజాదీ కా ప్లాన్ బెనిఫిట్స్ :
రూ.1 ప్లాన్ ధర 30 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటాతో ఫ్రీ సిమ్, రోజువారీ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ఆఫర్ పొందే యూజర్లు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ CSC లేదా రిటైలర్‌ను సంప్రదించి కొత్త సిమ్ కొనుగోలు చేయొచ్చు.
బీఎస్ఎన్ఎల్ 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందించే రూ.599 ప్లాన్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS పొందవచ్చు. రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 54 రోజుల వ్యాలిడిటీతో ఇతర ప్లాన్‌లు కూడా ఉన్నాయి.