WhatsApp Schedule Calls : గుడ్ న్యూస్.. వాట్సాప్ యూజర్లకు పండగే.. ఇకపై ఫోన్ కాల్స్ షెడ్యూల్ చేయొచ్చు.. ఇదిగో స్టెప్ బై స్టెప్ గైడ్..!

WhatsApp Schedule Calls : వాట్సాప్ యూజర్ల కోసం మెసేజింగ్ యాప్ షెడ్యూల్ కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Schedule Calls : గుడ్ న్యూస్.. వాట్సాప్ యూజర్లకు పండగే.. ఇకపై ఫోన్ కాల్స్ షెడ్యూల్ చేయొచ్చు.. ఇదిగో స్టెప్ బై స్టెప్ గైడ్..!

WhatsApp Schedule Calls

Updated On : August 15, 2025 / 3:26 PM IST

WhatsApp Schedule Calls : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ కాలింగ్ ఫీచర్ కోసం (WhatsApp Schedule Calls) బిగ్ అప్‌డేట్‌ రిలీజ్ చేసింది. మీరు ఇప్పుడు వాట్సాప్ కాల్స్ ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు.

మీ ఫ్యామిలీ చాట్ అయినా లేదా వర్క్ మీటింగ్ అయినా మీరు ఇప్పుడు షెడ్యూల్ టైమ్ సెట్ చేయవచ్చు. ఇతర వ్యక్తులను ఇన్వైట్ చేయొచ్చు. వాట్సాప్ కాల్ ప్రారంభమయ్యే ముందు వాట్సాప్ అందరికీ అలర్ట్ చేస్తుంది. వాట్సాప్ చాట్ మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ ఇతర ఇన్-కాల్ అప్‌గ్రేడ్‌లతో పాటు ఈ ఫీచర్‌ను ప్రకటించింది.

వాట్సాప్ కాల్స్ :
షెడ్యూల్డ్ కాల్స్ : మీరు ఇప్పుడు గ్రూప్ కాల్స్‌ను ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. వ్యక్తులను లేదా మొత్తం గ్రూపులను ఇన్వైట్ చేయొచ్చు. కాల్ బిగిన్ కాకముందే జాయిన్ వారందరికీ నోటిఫికేషన్ వస్తుంది.
కొత్త ఇన్-కాల్ ఇంటరాక్షన్ టూల్స్ : కొత్త ఇన్-కాల్ టూల్స్ మీరు ఎమోజీలతో రియాక్ట్ అయ్యేందుకు అంతరాయం లేకుండా సిగ్నల్ ఇచ్చేందుకు అనుమతిస్తాయి.

Read Also : Realme P4 5G Series : కొత్త రియల్‌మి P4 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు రివీల్.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఇంప్రూవ్డ్ కాల్ మేనేజ్‌మెంట్ : వాట్సాప్ కాల్స్ ట్యాబ్ ఇప్పుడు రాబోయే కాల్స్ ఎవరు జాయిన్ అవుతున్నారో చూపిస్తుంది. ఇన్వైట్ లింక్‌లను షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎవరైనా లింక్ ద్వారా జాయిన్ అయితే కాల్ క్రియేటర్లు కూడా అలర్ట్స్ పొందుతారు.

వాట్సాప్ అన్ని కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో అందరు యూజర్లకు అందుబాటులోకి రానుంది. మీరు కొత్త ఫీచర్‌ను ఎలా వాడాలి? వాట్సాప్ కాల్స్ షెడ్యూల్ చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వాట్సాప్‌లో కాల్ షెడ్యూల్ చేయడం ఎలా? :

  • వాట్సాప్‌ యాప్ ఓపెన్ చేసి కాల్స్ ట్యాబ్‌కి వెళ్లండి.
  • కాల్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
  • మీరు కాల్ చేసే కాంటాక్ట్ లేదా గ్రూప్‌ను ఎంచుకోండి.
  • వెంటనే కాల్ బదులుగా, షెడ్యూల్ కాల్ ఆప్షన్ ఎంచుకోండి.
  • డేట్, టైమ్ సెట్ చేయండి.
  • వీడియో కాల్ లేదా ఆడియో కాల్ అనేది ఎంచుకోవాలి.
  • గ్రీన్ బటన్‌ను ట్యాప్ చేయండి.
  • షెడ్యూల్ కాల్ మీ రాబోయే కాల్స్ జాబితాలో కనిపిస్తుంది.
  • వాట్సాప్ కాల్స్ జాయిన్ అయ్యే వారందరికీ రిమైండర్‌ను పంపుతుంది.