Realme P4 5G Series : కొత్త రియల్‌మి P4 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు రివీల్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme P4 5G Series : రియల్‌మి P4 5G సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే రియల్‌మి కెమెరా స్పెషిఫికేషన్లు రివీల్ అయ్యాయి.

Realme P4 5G Series : కొత్త రియల్‌మి P4 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు రివీల్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme P4 5G Series

Updated On : August 15, 2025 / 2:26 PM IST

Realme P4 5G Series : కొత్త రియల్‌మి ఫోన్ సిరీస్ రాబోతుంది. రియల్‌మి P4 5G, రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ ఆగస్టు 20న భారత మార్కెట్లో లాంచ్ (Realme P4 5G Series) కానుంది. నివేదికల ప్రకారం.. ఈ లైనప్‌లో 2 హ్యాండ్‌సెట్‌లు ఉండే అవకాశం ఉంది.

రియల్‌మి కొన్ని స్పెసిఫికేషన్‌లను రివీల్ చేశాక కంపెనీ ఇప్పుడు రాబోయే రియల్‌మి P4 5G సిరీస్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను వెల్లడించింది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయి. ఈ స్టాండర్డ్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, రియల్‌మి P4 ప్రో 5G స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుంది.

రియల్‌మి P4 5G, P4 ప్రో 5G కెమెరా స్పెసిఫికేషన్లు :
రాబోయే రియల్‌మి P4 ప్రో 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ IMX896 సెన్సార్ ఉంటుందని చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ధృవీకరించారు. ఫ్రంట్ సైడ్ 50MP OV50D సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60fps వద్ద 4K వీడియోను రికార్డ్ చేయగలదు. వినియోగదారులు 30fps వద్ద 4K రిజల్యూషన్ HDR వీడియోలను రికార్డ్ చేయొచ్చు.

రియల్‌మి ప్రో మోడల్ అల్ట్రా స్టెడీ వీడియో, ఏఐ మోషన్ స్టెబిలైజేషన్‌తో కూడిన అడ్వాన్స్ హైపర్‌షాట్ ఆర్కిటెక్చర్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఏఐ స్నాప్ మోడ్‌లో కంపెనీ ఏఐ ట్రావెల్ స్నాప్, ఏఐ ల్యాండ్‌స్కేప్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

స్టాండర్డ్ రియల్‌మి P4 5Gలో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియోలను షూట్ చేయొచ్చు. రియల్‌మి P4 ప్రో వేరియంట్ మాదిరిగానే ఏఐ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

రియల్‌మి P4 5G, P4 ప్రో 5G కీలక స్పెసిఫికేషన్లు (అంచనా) :
రాబోయే రియల్‌మి ఫోన్ అనేక కీలక స్పెసిఫికేషన్‌లను కూడా ధృవీకరించింది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో రియల్‌మి P4 ప్రో 5Gలో ప్రత్యేకమైన హైపర్‌విజన్ ఏఐ జీపీయూ ఉంటుంది. గేమింగ్ కోసం 7,000 చదరపు మిల్లీమీటర్లు, ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్ ఇంటర్నల్ టెంపరేచర్ అందిస్తుంది. ఈ ఫోన్ 7.68mm మందంతో ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,000mAh బ్యాటరీని కూడా అందిస్తుంది.

Read Also : FASTag Annual Toll Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక టోల్ పాస్ 2025.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎలా అప్లయ్ చేయాలి? అర్హతలేంటి? ఫుల్ డిటెయిల్స్..!

ఈ ఫోన్ 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 90fps వద్ద 8 గంటలకు పైగా బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్‌ప్లేను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రో వేరియంట్ హైపర్‌గ్లో అమోల్డ్ 4D కర్వ్+ స్క్రీన్ 144Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. 6,500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సర్టిఫికేషన్, 4,320Hz హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌కు సపోర్టు కలిగి ఉంటుంది. రియల్‌మి P4 ప్రో 5G డిస్‌ప్లే కూడా ఉందని కంపెనీ ధృవీకరించింది.

మరోవైపు, స్టాండర్డ్ రియల్‌మి P4 5G, మీడియాటెక్ డైమన్షిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్‌తో పాటు స్పెషల్ పిక్సెల్‌వర్క్స్ చిప్‌తో వస్తుంది. ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.77-అంగుళాల హైపర్‌గ్లో అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుందని అంచనా. ఈ స్క్రీన్ 3,840Hz పల్స్-విడ్త్ మాడ్యులేషన్ (PWM) డిమ్మింగ్, హార్డ్‌వేర్-లెవల్ బ్లూ లైట్, ఫ్లికర్ రిడక్షన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

రియల్‌మి P4 5Gలో 7,000mAh టైటాన్ బ్యాటరీ ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 11 గంటల వరకు BGMI గేమ్‌ప్లే అందిస్తుంది. రాబోయే హ్యాండ్‌సెట్ బ్యాటరీ 25 నిమిషాల్లో దాదాపు 50 శాతం ఛార్జ్ అవుతుందని పేర్కొన్నారు. రివర్స్ ఛార్జింగ్, ఏఐ స్మార్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. రియల్‌మి P4 5G, రియల్‌మి P4 ప్రో 5G సింగిల్ కూలింగ్ సిస్టమ్‌ కలిగి ఉన్నాయి. ఈ సిరీస్ ధర రూ. 20వేల లోపు ధరలో ఉండొచ్చు.