FASTag Annual Toll Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక టోల్ పాస్ 2025.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎలా అప్లయ్ చేయాలి? అర్హతలేంటి? ఫుల్ డిటెయిల్స్..!

FASTag Annual Toll Pass : వార్షిక పాస్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్, బెనిఫిట్స్, ధర, వ్యాలిడిటీ, యాక్టివేషన్ వంటి ఎలా చేయాలో చూద్దాం..

FASTag Annual Toll Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక టోల్ పాస్ 2025.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎలా అప్లయ్ చేయాలి? అర్హతలేంటి? ఫుల్ డిటెయిల్స్..!

FASTag Annual Toll Pass

Updated On : August 15, 2025 / 12:46 PM IST

FASTag Annual Toll Pass : దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ (NH) అంతటా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రైవేట్ వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ (FASTag Annual Toll Pass) ఆధారిత వార్షిక పాస్ సిస్టమ్ శుక్రవారం (ఆగస్టు 15) అమల్లోకి వచ్చింది.

ఈ వార్షిక పాస్ కేవలం కార్లు, వ్యాన్లు మొదలైన వాటితో సహా వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వార్షిక పాస్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్, బెనిఫిట్స్, ధర, వ్యాలిడిటీ, యాక్టివేషన్ వంటి అన్నింటిని ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా 2014లో ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారు. క్యాష్ లెస్ టోల్ పేమెంట్లు, టోల్ ప్లాజాల వద్ద అడ్డంకులను తగ్గించేందుకు ఈ సిస్టమ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక టోల్ పాస్ ముఖ్య ప్రయోజనాలివే :
వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక ప్రకటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘వాహన యజమానులు డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీజు ప్లాజాల వద్ద రద్దీ తగ్గుతుంది. వాహన యజమానులకు డబ్బులు ఆదాతో పాటు టైమ్ సేవ్ అవుతుంది. ఏడాదిలో ఫీజు ప్లాజా క్రాసింగ్‌లతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది” అని గడ్కరీ పేర్కొన్నారు.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక టోల్ పాస్ 2025 ధర, వ్యాలిడిటీ :
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. వాణిజ్యేతర ప్రయోజనాల కోసం రిజిస్టర్ వాహనాన్ని కలిగిన వ్యక్తి, వ్యాలీడ్ అయ్యే యాక్టివ్ ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉండాలి. రూ. 3వేలు రుసుము చెల్లించి వార్షిక పాస్ పొందవచ్చు. ఈ పాస్ ఒక ఏడాది పాటు లేదా జాతీయ రహదారిపై ఏదైనా ఫీజు ప్లాజా ద్వారా 200 క్రాసింగ్‌లకు వరకు వర్తిస్తుంది. ఇందులో ఏది ముందు పూర్తి అయితే అది వర్తిస్తుంది. ప్రతి ఫీజు ప్లాజాలో వసూలు చేసే ఫాస్ట్ ట్యాగ్ రుసుముతో సంబంధం ఉండదు.

ఫాస్ట్‌ట్యాగ్ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు :
కేవలం చాసిస్ నంబర్‌తో రిజిస్టర్ చేసిన ఫాస్ట్ ట్యాగ్స్‌పై వార్షిక పాస్ జారీ అవుతుంది. వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేసేందుకు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)ను అప్‌డేట్ చేయాలి. ఫాస్ట్ ట్యాగ్ కోసం దరఖాస్తుతో పాటు ఈ కింది డాక్యుమెట్లను సమర్పించాలి.

  • వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC).
  • వాహన యజమాని పాస్‌పోర్ట్ సైజు ఫొటో.
  • వాహన యజమాని కేటగిరీ KYC డాక్యుమెంట్లు
  • ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్

ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలి? :
ఫాస్ట్ ట్యాగ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ కోసం NHAI ఫాస్ట్ ట్యాగ్‌ను ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంకు మొదలైన బ్యాంక్ పోర్టల్స్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

Read Also : OnePlus 13 Price Cut : కొత్త ఫోన్ కావాలా? అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గిందోచ్.. డోంట్ మిస్!

ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ ప్రాసెస్ :
వార్షిక పాస్‌ రాజ్‌మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్, NHAI వెబ్‌సైట్‌లో మాత్రమే యాక్టివేట్ చేయవచ్చు. వాహనం అర్హత, సంబంధిత ఫాస్ట్‌ట్యాగ్ ధృవీకరించిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. వెరిఫికేషన్ పూర్తి అయ్యాక వినియోగదారులు రాజ్‌మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా ఎన్‌హెచ్ఏఐ వెబ్‌సైట్ ద్వారా 2025–26 బేస్ సంవత్సరానికి రూ. 3వేలు పేమెంట్ చేయాలి. పేమెంట్ తర్వాత వార్షిక పాస్ సాధారణంగా 2 గంటల్లోపు రిజిస్టర్డ్ ఫాస్ట్ ట్యాగ్‌లో యాక్టివేట్ అవుతుంది.

మీ ఫాస్ట్ ట్యాగ్ పాస్‌ను ఎలా రెన్యువల్ చేయాలి? :
వార్షిక పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది లేదా 200 పేమెంట్స్ (ట్రిప్‌లు) రెండింటిలో ఏది ముందుగా వస్తే అది వర్తిస్తుంది. వార్షిక పాస్ 200 ట్రిప్పులు లేదా యాక్టివేషన్ తేదీ నుంచి ఒక ఏడాది పూర్తి చేసిన తర్వాత అది ఆటోమాటిక్‌గా సాధారణ ఫాస్ట్ ట్యాగ్‌కి మారిపోతుంది. వార్షిక పాస్ బెనిఫిట్స్ కొనసాగించాలంటే వాహనదారులు వార్షిక పాస్‌ను రీయాక్టివేట్ చేయాలి.

కస్టమర్ సపోర్ట్, హెల్ప్‌లైన్ నంబర్లు :
టోల్ ప్లాజాలలో NETC ఫాస్ట్‌ట్యాగ్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) 1033 హెల్ప్‌లైన్ నంబర్‌ ప్రారంభించాయి.