OnePlus 13 Price Cut : కొత్త ఫోన్ కావాలా? అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గిందోచ్.. డోంట్ మిస్!
OnePlus 13 Price Cut : అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13 Price Cut
OnePlus 13 Price Cut : కొత్త వన్‌ప్లస్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 13 సిరీస్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మిడ్-రేంజ్, ఫ్లాగ్‌షిప్ ఫోన్ మొత్తం 2 కేటగిరీలలో (OnePlus 13 Price Cut) లభిస్తోంది. ఫ్లాగ్‌షిప్ వేరియంట్ వన్‌ప్లస్ 13 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కెమెరా సెటప్ కలిగి ఉంది.
మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర తగ్గింపు :
వన్‌ప్లస్ 13 ఫోన్ అసలు లాంచ్ ధర రూ.69,999 నుంచి 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.62,999కు లభ్యమవుతుంది. గత 30 రోజుల్లో ఇదే అతిపెద్ద ధర తగ్గింపు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసే యూజర్లందరికి అదనంగా రూ.1,889 వరకు అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాదు, జియో సిమ్ యూజర్లు ఈ వన్‌ప్లస్ 13 కొనుగోలుపై 10 OTT ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13లో 6.82-అంగుళాల LTPO 4.1 అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ప్యానెల్ డాల్బీ విజన్, ఇతర ఫీచర్లతో హై-క్వాలిటీ స్ట్రీమింగ్ సపోర్టును అందిస్తుంది. సిరామిక్ గ్లాస్ షీల్డ్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS (OxygenOS 15)పై రన్ అవుతుంది. కంపెనీ 4 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం హై-ఆక్టేన్ పర్ఫార్మెన్స్ అడ్రినో 830 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కలిగి ఉంది.
వన్‌ప్లస్ 13లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 3X ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ వన్‌ప్లస్ ఫోన్ 32MP ఫ్రంట్ స్నాపర్‌ను కూడా కలిగి ఉంది. 100W వైర్డు, 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6000mAh బ్యాటరీ కలిగి ఉంది.