WhatsApp Status Video : హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో ఇలా డౌన్‌లోడ్ చేసి షేర్ చేయండి.. సింపుల్ ప్రాసెస్..!

Happy Independence Day 2025 : బ్రిటిష్ వలస పాలన నుంచి దేశం విముక్తి పొందినందుకు గుర్తుగా భారత్ 79వ ఇండిపెండెన్స్ ఆగస్టు 15న జరుపుకుంటారు.

WhatsApp Status Video : హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో ఇలా డౌన్‌లోడ్ చేసి షేర్ చేయండి.. సింపుల్ ప్రాసెస్..!

WhatsApp Status Video

Updated On : August 15, 2025 / 11:28 AM IST

WhatsApp Status Video – Happy Independence Day 2025 : భారతీయులందరూ ఆగస్టు 15, 2025న (నేడు) 79వ స్వాతంత్య్ర  దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత బ్రిటిష్ పాలన నుంచి దేశం విముక్తి పొంది దాదాపు 8 దశాబ్దాలు పూర్తవుతోంది. ఈరోజు క్యాలెండర్‌లో ఒక తేదీ మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడిలో(WhatsApp Status Video) లోతుగా ప్రతిధ్వనించే క్షణం.

దేశభక్తిని చాటుకునే అద్భుతమైన క్షణం. అందుకే ప్రతిఒక్క భారతీయుడు తమ దేశభక్తిని చాటుకునేందుకు అందరికి జాతీయ గీతాలను ఆలపిస్తుంటారు. నేటి డిజిటల్ యుగంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో దగ్గరలో ఉన్నా లేదా దూరంగా ఉన్నా జాతీయ పండుగ ఉత్సాహాన్ని వాట్సాప్ స్టేటస్ వీడియోను షేర్ చేస్తుంటారు. ఇంతకీ మీరు కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాట్సాప్ వీడియో స్టేటస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

2025 ఇండిపెండెన్స్ డే వాట్సాప్ స్టేటస్ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
మీరు ఇండిపెండెన్స్ డే వీడియోను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. పెక్సెల్స్ (Pexels), పిక్సాబే (Pixabay) వంటి ఫ్రీ స్టాక్ మీడియా సైట్‌లు హై క్వాలిటీ వీడియోలు, ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు, Perplexity, Grok, Gemini వంటి AI టూల్స్ ద్వారా కూడా మీ సొంత కస్టమైజడ్ ఇండిపెండెన్స్ డే వీడియోను కూడా క్రియేట్ చేయొచ్చు. కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఫుల్ రెజుల్యుషన్ డౌన్‌లోడ్‌ కోసం మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.

Read Also : FASTag Recharge : ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు మీకోసమే.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేతో ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఇదిగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

షేర్‌చాట్ ప్లాట్‌ఫామ్‌లో ఈజీగా డౌన్‌లోడ్‌ చేసే ఇతర షార్ట్ వీడియో యాప్‌లను కూడా మీరు ట్రై చేయొచ్చు. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రత్యేకమైన వాట్సాప్ స్టేటస్ వీడియో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయొచ్చు. సేఫ్టీ కోసం డౌన్‌లోడ్ చేసే ముందు రివ్యూలు, హై రేటింగ్స్ వంటివి చెక్ చేయండి.

మీ వాట్సాప్ ఇండిపెండెన్స్ డే వీడియో స్టేటస్ ఎలా అప్‌లోడ్ చేయాలి? :

  • వాట్సాప్ ఓపెన్ చేసి ‘Updates’ ట్యాబ్‌కి వెళ్లండి.
  • స్టేటస్ కేటగిరీలో మీ ప్రొఫైల్ ఫొటోపై ‘+’ ఐకాన్ ట్యాప్ చేయండి.
  • మీ గ్యాలరీ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఇండిపెండెన్స్ డే వీడియోను ఎంచుకోండి.
  • ఆపై వాట్సాప్ వీడియోను షేర్ చేసేందుకు గ్రీన్ SEND ఐకాన్ ట్యాప్ చేయండి.