FASTag Recharge : ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు మీకోసమే.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేతో ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఇదిగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
FASTag Recharge : ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు తమ రీఛార్జ్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఎలా చేయాలంటే?

FASTag Recharge
FASTag Recharge : ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారత్‌లో చాలా మంది కార్ల యజమానులకు ముఖ్యంగా తరచుగా ప్రయాణించే వారికి FASTag తప్పనిసరిగా మారింది. FASTag అనేది RFID-ఆధారిత స్టిక్కర్. టోల్ ప్లాజాలలో పేమెంట్లను వేగంగా పూర్తి చేయొచ్చు.
పార్టనర్ బ్యాంకుల ద్వారా ఈ ఫాస్ట్‌ట్యాగ్ అందిస్తుంది. మీ FASTag అకౌంటులో బ్యాలెన్స్‌ను ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ప్రయాణాలకు ఇది చాలా కీలకం. ఎందుకంటే.. మీరు టోల్ దాటినప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా క్యాష్ కట్ అవుతుంది.
ఫాస్ట్ ట్యాగ్‌లో క్యాష్ లోడింగ్ కోసం అనేక విధాలుగా చేయవచ్చు. Paytm, PhonePe లేదా Google Pay వంటి పేమెంట్ యాప్స్ వినియోగించవచ్చు. మీరు FASTag వాడేందుకు కొత్తవారైతే మీరు వివిధ యాప్స్ ద్వారా ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పేటీఎం ఉపయోగించి FASTag రీఛార్జ్ చేయడం ఎలా? :
- మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
- యాప్‌లోని ఫాస్ట్ ట్యాగ్ సెక్షన్‌కు నావిగేట్ చేయండి.
- మీరు ఈ కిందికి స్క్రోల్ చేసి చూడవచ్చు.
- ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి.
- మీ వాహన వివరాలను ఎంటర్ చేయండి.
- పేటీఎం వ్యాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ఏదైనా మెథడ్ ఉపయోగించి పేమెంట్ పూర్తి చేయండి.
గూగుల్ పేతో FASTag రీఛార్జ్ చేయడం ఎలా? :
- మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్‌లో గూగుల్ పే అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
- ఇప్పుడు, యాప్‌లోని పేమెంట్ బిల్లుల సెక్షన్‌కు వెళ్లండి.
- ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఆప్షన్ ట్యాప్ చేయండి.
- ఆ తరువాత పేమెంట్ కేటగిరీలపై ట్యాప్ చేయండి.
- ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన బ్యాంకు, వాహనం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ఎంచుకుని ఆపై రీఛార్జ్ బటన్‌పై ట్యాప్ చేయండి.
- మొత్తాన్ని ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేస్తే చాలు..
ఫోన్‌పేతో FASTag రీఛార్జ్ చేయడం ఎలా? :
- PhonePe అప్లికేషన్ ఓపెన్ చేయండి.
- రీఛార్జ్, పేమెంట్ బిల్స్ సెక్షన్‌కు వెళ్లండి.
- ఇక్కడే FASTag రీఛార్జ్ ఎంచుకోండి.
- మీ బ్యాంక్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి.
- కన్ఫర్మ్ చేయండి. ఆపై పేమెంట్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
- రీఛార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేసి పేమెంట్ చేయండి.
- మీ FASTag అకౌంట్ బ్యాలెన్స్ క్రెడిట చెక్ చేయండి.