Tecno Spark Go 5G : 6000mAh బ్యాటరీతో కొత్త టెక్నో స్పార్క్ గో 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, రూ. 10వేల ధరలో కొనేసుకోవచ్చు!
Tecno Spark Go 5G : టెక్నో స్పార్క్ గో 5G ఫోన్ వచ్చేసింది. 6000mAh బ్యాటరీతో రూ.10వేల లోపు ధరలో పొందవచ్చు.

Tecno Spark Go 5G
Tecno Spark Go 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూ్స్.. భారత మార్కెట్లో టెక్నో స్పార్క్ గో 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీని (Tecno Spark Go 5G) కలిగి ఉంది. రూ. 10వేల కన్నా తక్కువ ధరకు లభ్యమవుతుంది.
రెడ్‌మి, రియల్‌మి, శాంసంగ్ వంటి బ్రాండ్‌ల నుంచి బడ్జెట్ ఫోన్లకు పోటీదారుగా నిలుస్తోంది. స్పార్క్ సిరీస్‌కు ఈ కొత్త బ్యాక్ సైడ్ స్పెషల్ కెమెరా సెటప్ ఉంది. ఈ సిరీస్‌లో 6000mAh బ్యాటరీతో ఫస్ట్ 5G ఫోన్. టెక్నో స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టెక్నో స్పార్క్ గో 5G భారత్ ధర ఎంతంటే? :
టెక్నో స్పార్క్ గో 5G సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. 4GB ర్యా్మ్ + 128GB ధర రూ. 9,999కు పొందవచ్చు. స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టర్కిష్ గ్రీన్, హెరిటేజ్ ఇన్‌స్పైర్డ్ బికనీర్ రెడ్ 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆగస్టు 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ అన్ని ఇతర ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
టెక్నో స్పార్క్ గో 5G ఫీచర్లు :
డిజైన్ : 7.99mm అత్యంత సన్నని ఫోన్లలో ఇదొకటి. డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ కోసం IP64 రేటింగ్ కలిగి ఉంది.
డిస్‌ప్లే : 120Hz హై-రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్
పర్ఫార్మెన్స్ : ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో వస్తుంది. 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్, 128GB ఎక్స్‌పాండబుల్ ఇంటర్నల్ స్టోరేజీ
బ్యాటరీ : 6000mAh బ్యాటరీ, USB టైప్-C ఛార్జింగ్‌తో వస్తుంది.
కెమెరాలు :
బ్యాక్ కెమెరా : 50MP మెయిన్ సెన్సార్, సెకండరీ కెమెరాతో డ్యూయల్-కెమెరా సెటప్.
ఫ్రంట్ కెమెరా : సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాలు.
సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HiOSపై రన్ అవుతుంది. ఎల్లా ఏఐ అసిస్టెంట్‌కు సపోర్టు ఇస్తుంది.