WhatsApp Schedule Calls
WhatsApp Schedule Calls : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ కాలింగ్ ఫీచర్ కోసం (WhatsApp Schedule Calls) బిగ్ అప్‌డేట్ రిలీజ్ చేసింది. మీరు ఇప్పుడు వాట్సాప్ కాల్స్ ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు.
మీ ఫ్యామిలీ చాట్ అయినా లేదా వర్క్ మీటింగ్ అయినా మీరు ఇప్పుడు షెడ్యూల్ టైమ్ సెట్ చేయవచ్చు. ఇతర వ్యక్తులను ఇన్వైట్ చేయొచ్చు. వాట్సాప్ కాల్ ప్రారంభమయ్యే ముందు వాట్సాప్ అందరికీ అలర్ట్ చేస్తుంది. వాట్సాప్ చాట్ మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ ఇతర ఇన్-కాల్ అప్‌గ్రేడ్‌లతో పాటు ఈ ఫీచర్‌ను ప్రకటించింది.
వాట్సాప్ కాల్స్ :
షెడ్యూల్డ్ కాల్స్ : మీరు ఇప్పుడు గ్రూప్ కాల్స్‌ను ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. వ్యక్తులను లేదా మొత్తం గ్రూపులను ఇన్వైట్ చేయొచ్చు. కాల్ బిగిన్ కాకముందే జాయిన్ వారందరికీ నోటిఫికేషన్ వస్తుంది.
కొత్త ఇన్-కాల్ ఇంటరాక్షన్ టూల్స్ : కొత్త ఇన్-కాల్ టూల్స్ మీరు ఎమోజీలతో రియాక్ట్ అయ్యేందుకు అంతరాయం లేకుండా సిగ్నల్ ఇచ్చేందుకు అనుమతిస్తాయి.
ఇంప్రూవ్డ్ కాల్ మేనేజ్‌మెంట్ : వాట్సాప్ కాల్స్ ట్యాబ్ ఇప్పుడు రాబోయే కాల్స్ ఎవరు జాయిన్ అవుతున్నారో చూపిస్తుంది. ఇన్వైట్ లింక్‌లను షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎవరైనా లింక్ ద్వారా జాయిన్ అయితే కాల్ క్రియేటర్లు కూడా అలర్ట్స్ పొందుతారు.
వాట్సాప్ అన్ని కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో అందరు యూజర్లకు అందుబాటులోకి రానుంది. మీరు కొత్త ఫీచర్‌ను ఎలా వాడాలి? వాట్సాప్ కాల్స్ షెడ్యూల్ చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వాట్సాప్‌లో కాల్ షెడ్యూల్ చేయడం ఎలా? :