ఇదో లేటెస్ట్ టెక్నాలజీ : గూగుల్ Paper Phone వస్తోంది

  • Publish Date - October 29, 2019 / 07:51 AM IST

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఇతర స్మార్ట్ ఫోన్ల మాదిరిగా ఈ ఫోన్ ఉండదట. చూడటానికి అచ్చం ఒక పేపర్ ముక్క మాదిరిగానే కనిపిస్తుంది. డిజిటల్ వెల్ బీయింగ్ ఎక్స్ పెరిమెంట్స్ ప్యాకేజీలో భాగంగా గూగుల్ ఈ కొత్త పేపర్ ఫోన్ ప్రవేశపెడుతోంది. గూగుల్ ఓపెన్ సోర్స్ ఎక్స్ పెరిమెంట్స్ ల్లో పేపర్ ఫోన్ ప్రాజెక్టు ఇదొకటి. గూగుల్ ప్రవేశపెట్టే ఈ కొత్త పేపర్ ఫోన్ నుంచి సెల్ఫీలు తీసుకోవడం కుదరదు.

కనీసం ఫోన్ కాల్స్ కూడా చేయడం సాధ్యపడదు. ఇది కేవలం ఒక కాగితపు ముక్క మాత్రమే. హోం పేజీపై సంక్షిప్త సమాచారంతో నిండి ఉంటుంది. దీర్ఘచతురస్రం మాదిరిగా ఈ పేపర్ ఫోన్ ను మడత పెట్టుకోవచ్చు. దీనికో క్రెడిట్ కార్డు కూడా ఉంది. ‘డిజిటల్ డిటెక్స్’ పేరుతో యూజర్లకు అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇటీవలే గూగుల్ 800 డాలర్ల విలువైన లేటెస్ట్ Pixel 4 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే రోజున ఈ పేపర్ ఫోన్ ను కూడా పరిచయం చేసింది. 

ర్యాడర్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ ద్వారా యూజర్ల చేతుల్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. టెక్నికల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడిపే యూజర్ల ఆసక్తిని తమవైపు ఆకర్షించేలా గూగుల్ ఈ కొత్త పేపర్ ఫోన్ ఆఫర్ చేస్తోంది. మీరు నిద్రించే సమయంలో ఈ పేపర్ ఫోన్ మరో గదిలో పెట్టుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్ ఓపెన్ సోర్స్ ఎక్స్ పెరిమెంట్లలో పేపర్ ఫోన్ ప్రాజెక్టు ఒకటి కాగా.. ఇందులోని ప్రత్యేకమైన వాల్ పేపర్ ద్వారా యూజర్ రోజుకు ఎన్నిసార్లు తమ డివైజ్ ను Unclock చేశారో కౌంట్ చేస్తుంది. 

దీనిలో ‘డిజర్ట్ ఐలాండ్’ ప్రొగ్రామ్ ఉంది. దీనిద్వారా యూజర్లు తమ డివైజ్ లోని ముఖ్యమైన యాప్స్ ను 24గంటల వరకు యాక్సస్ చేసుకోవచ్చు. డిజిటల్ ప్రపంచంలో పేపర్ ప్రొడక్టులను ప్రవేశపెట్టడం గూగుల్ తొలి ప్రయత్నం కాదు. 2014లోనే cardboard అనే పేపర్ ప్రొడక్టును గూగుల్ ప్రవేశపెట్టింది. స్మార్ట్ ఫోన్లపై వర్చువల్ రియాల్టీ అప్లికేషన్స్ వీక్షించేందుకు ఇదొక మార్గాన్ని సూచించింది. 19నెలల్లో 5 మిలియన్ల జతల లో-టెక్ గ్లాసులను రవాణా చేసినట్టు గూగుల్ తెలిపింది.