UPI New Charges : యూజర్లకు UPI ఫ్రీనా? కాదా? అక్టోబర్ 15 నుంచి కొత్త ఛార్జీలు.. ఎవరికి ఛార్జీ ఎంతంటే? ఇదిగో క్లారిటీ..!

UPI New Charges : అక్టోబర్ 15 నుంచి UPI లావాదేవీలపై కొత్త MDR ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. ఇవి సాధారణ యూపీఐ యూజర్లకు వర్తిస్తాయా? వ్యాపారులకా? పూర్తి వివరాలు తెలుసుకోండి.

UPI New Charges

  • యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్! అక్టోబర్ 15 నుంచి కొత్త ఛార్జీలు
  • UPI చెల్లింపులపై ఛార్జీలు షురూ.. ఎవరికి వర్తిస్తాయంటే?
  • రూ. 2,000పైన UPI చెల్లింపులకు కొత్త రూల్.. వ్యాపారులకే ఛార్జీనా?
  • ఎంత పేమెంట్ చేస్తే ఎంత ఛార్జీ పడుతుందంటే?
  • వ్యాపారులకు వ్యక్తులు చేసే యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు ఇవేనా?

UPI New Charges : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త యూపీఐ ఛార్జీలు రాబోతున్నాయి. అక్టోబర్ 15 నుంచి ఈ యూపీఐ ఛార్జీలు చెల్లించాల్సిందే.. ఇంతకీ యూపీఐ కొత్త ఛార్జీలు సాధారణ యూజర్లకు వర్తిస్తాయా? మరి ఎవరు చెల్లించాలి? ఇప్పుడే ఇదే ప్రశ్న అందరిలో వినిపిస్తోంది. యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే కోట్లాది మంది యూజర్లు ఇదే విషయంలో ఆందోళన చెందుతున్నారు.

అక్టోబర్ 15 నుంచి కొత్త ఛార్జీలు :
ఈ నేపథ్యంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. దాంతో ఇక నుంచి యూపీఐ ఉచితం కాదా?” అనే సందేహం చాలామందిలో మొదలైంది. కానీ, వాస్తవం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణ యూజర్లకు పూర్తిగా ఉచితం :
ఎన్‌పీసీఐ ప్రకారం.. ఈ కొత్త ఛార్జీలు సాధారణ యూపీఐ యూజర్లపై ఎలాంటి ప్రభావం చూపవు. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే పేమెంట్లు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. అలాగే, రూ. 2వేల వరకు జరిగే వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) పేమెంట్లు కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే ఉంటాయి. మొత్తం యూపీఐ P2M లావాదేవీల్లో 95శాతం కన్నా ఎక్కువ ఈ కేటగిరీలోకే వస్తాయని ఎన్‌పీసీఐ తెలిపింది.

Read Also : RBI Repo Rate Hike : ఆర్‌బీఐ రెపో రేటు పెంపు తప్పదా? మీ హోం లోన్ ఈఎంఐలు భారీగా పెరగొచ్చు..!

రూ. 2వేలు దాటితే 0.4 శాతం ఎండీఆర్ : 
అయితే, రూ. 2వేలు దాటిన మర్చంట్ యూపీఐ పేమెంట్లపై మాత్రం 0.4శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. ఈ ఛార్జీని వినియోగదారులు కాకుండా మర్చంట్లే భరించాల్సి ఉంటుంది. రూ. 75వేలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఛార్జీ గరిష్టంగా రూ. 300కు మాత్రమే పరిమితంగా ఉంటుంది. ఉదాహరణకు.. యూపీఐ ద్వారా రూ. 1 లక్ష చెల్లింపుపై సాధారణంగా రూ. 400 అవ్వాల్సి ఉన్నా గరిష్ట పరిమితి కారణంగా రూ. 300 మాత్రమే వసూలు చేయనుంది.

ఎంత పేమెంట్ చేస్తే ఎంత ఛార్జీ పడుతుందంటే? :

  • వ్యాపారులకు వ్యక్తులు చేసే యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు ఇవే :
  • రూ.2000 నుంచి 3000 మధ్య రూ.5 ఛార్జీ
  • రూ.3000కు రూ.12
  • రూ.50,000కు రూ.200
  • రూ.75,000 ఆ పైన చెల్లింపులకు రూ.300
  • చిరు వ్యాపారులకు రూ.లక్ష వరకు ఎలాంటి MDR ఉండదు.
  • రూ.2వేలు పైబడిన లావాదేవీలపై ఫిక్స్‌డ్‌గా రూ.5 MDR వర్తిస్తుంది.

UPI Charges

వీరికి ఎండీఆర్ నుంచి మినహాయింపు : 
రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాల్లో రూ. 2వేలుపైనా లావాదేవీలకు ఫ్లాట్‌గా రూ. 5 మాత్రమే ఎండీఆర్ విధిస్తారు. చిన్న వ్యాపారులు (నెలకు రూ. 1 లక్ష వరకు క్యూఆర్ కోడ్ చెల్లింపులు అందుకునే వారు) పూర్తిగా ఎండీఆర్ నుంచి మినహాయింపు పొందుతారు.

సర్వర్ మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ ఖర్చుల కోసమే ఈ చర్య తీసుకున్నట్లు ఎన్ పీసీఐ చెప్పింది. మొత్తానికి, సాధారణ యూజర్లు ఈ కొత్త ఛార్జీల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.