Haier Desert Rose AI AC : ఈ కొత్త AI స్మార్ట్ ఏసీ చూశారా? రిమోట్‌తో పనిలేదు.. మీరు ఇంటికెళ్లే లోపే కూలింగ్ చేస్తుంది.. ధర ఎంతంటే?

Haier Desert Rose AI AC : హైయర్ ఇండియా 'డెసర్ట్ రోజ్' సూపర్ హెవీ-డ్యూటీ ఏసీ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఏఐ-అట్మోఎక్స్ టెక్నాలజీతో కేవలం 10 సెకన్లలోనే మీ ఇంటి గదిని కూల్ చేస్తుంది. ధర ఎంత ఉంటుందంటే?

Haier Desert Rose AI AC

  • కొత్త ‘డెసర్ట్ రోజ్’ సూపర్ హెవీ-డ్యూటీ ఏసీ చూశారా?
  • ఏఐ-అట్మాక్స్ (AI-AtmoX) టెక్నాలజీ అదుర్స్
  • హ్యుమన్ డిటెక్షన్ కూలింగ్‌ అడ్జెస్ట్, ఏఐ ఆధారిత సిస్టమ్

Haier Desert Rose AI AC : అసలే సమ్మర్.. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువైపోయింది. ఏసీ, కూలర్ ఏదో ఒకటి ఇంట్లో ఆన్ ఉండాల్సిందే.. మీరు కూడా కొత్త ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో ఏఐ ఏసీ వచ్చేసింది. హైయర్ అప్లయన్సెస్ ఇండియా కొత్త డెసర్ట్ రోజ్ సూపర్ హెవీ డ్యూటీ ఏసీని రిలీజ్ చేసింది.

ఈ ఏసీలను భారత్ వంటి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఏసీలలో ఏఐ-అట్మాక్స్ (AI-AtmoX) టెక్నాలజీ ఉంది. ఆటోమేటిక్ కూలింగ్, పవర్ మెనేజ్‌మెంట్, ఈజీ మేనేజ్‌మెంట్ అందిస్తుంది. ఏసీ ఆటోమాటిక్‌గా రన్ అవుతుంది. వినియోగదారులు పదేపదే సెట్టింగ్‌ మార్చాల్సిన అవసరం ఉండదు.

ఏఐ స్మార్ట్ కూలింగ్‌ ఎలాగంటే? :
డెసర్ట్ రోజ్ సిరీస్‌లో రూమ్ టెంపరేచర్, బయటి వాతావరణం, యూజర్ అలవాట్ల ఆధారంగా కూలింగ్‌ను అడ్జెస్ట్ చేసే ఏఐ ఆధారిత సిస్టమ్ ఉంది. ఇందులో ఏఐ క్లైమేట్ కంట్రోల్ 2.0 ఫీచర్ ఉంది. మీ వినియోగాని బట్టి కూలింగ్‌ అడ్జెస్ట్ చేస్తుంది.

డైనమిక్ ఎన్విరాన్‌మెంటల్ అడాప్టేషన్ ఫీచర్, చుట్టుపక్కల వాతావరణానికి రియల్ టైమ్ అనుగుణంగా మారుతుంది. ఏఐ ప్రీ-కూలింగ్ అందిస్తుంది. మీరు ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉండగానే మీ గదిని ముందుగానే కూలింగ్ చేస్తుంది. మీరు ఇంటికి వచ్చేలోగా రూమ్ మొత్తం కూలింగ్ అయి ఉంటుంది.

Read Also : PAN Card Rules 2026 : పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆధార్ ఉన్నా PAN ఇవ్వరు.. ఈ గైడ్‌లైన్స్ తెలియకపోతే నష్టపోయేది మీరే..!

పవర్ ఆదా, స్మార్ట్ కంట్రోలింగ్ :
ఈ ఏసీలో ఏఐ ఈకో మోడ్ ఉంది. పవర్ వినియోగాన్ని తగ్గిస్తుంది. మీ వాడకం, వాతావరణం ఆధారంగా పవర్ ఆప్టిమైజ్ చేస్తుంది. ఏఐ ఎలక్ట్రిసిటీ మానిటరింగ్ ఫీచర్ గ్రాఫ్‌లు, క్యాలెండర్ ద్వారా పవర్ వినియోగాన్ని చూపిస్తుంది.

రియల్ టైమ్ వినియోగాన్ని కూడా చూపిస్తుంది. ఏఐ హ్యూమన్ డిటెక్షన్ ఫీచర్ గదిలో ఎవరైనా ఉన్నారా లేదా అని గుర్తిస్తుంది. 15 నిమిషాల పాటు ఎలాంటి మూవెంట్ లేకపోతే అది లో పవర్ మోడ్‌లోకి వెళ్తుంది. 30 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా కూడా ఆగిపోతుంది.

మెయింట్‌నెన్స్ చాలా ఈజీ :
డెసర్ట్ రోజ్ ఏసీలో ఏఐ ఫ్రాస్ట్ సెల్ఫ్-క్లీన్ ఫీచర్ ఉంది. ప్రతి 240 గంటలకు ఆటోమేటిక్‌గా క్లీన్ అవుతుంది. అవసరమైతే మాన్యువల్‌గా కూడా యాక్టివేట్ చేయొచ్చు. ఏఐ ఓడీయూ సైక్లోన్ క్లీన్ ఫీచర్, అవుట్‌డోర్ యూనిట్‌లో పేరుకుపోయిన డస్ట్ క్లీన్ చేస్తుంది. ఎయిర్ ఫ్లో రివర్స్ పంపి ఏసీ పర్ఫార్మెన్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు క్విక్ కూలింగ్ కావాలంటే సూపర్‌సోనిక్ కూలింగ్ ఫీచర్ కేవలం 10 సెకన్లలోనే కూలింగ్‌ను అందిస్తుంది.

ధర ఎంతంటే? :
హైయర్ డెసర్ట్ రోజ్ సూపర్ హెవీ డ్యూటీ ఏసీ భారత మార్కెట్లో గోల్డ్ స్ట్రైప్, నెబ్యులా బ్లూ స్ట్రైప్ అనే 2 మోడళ్లలో లభిస్తుంది. ఈ ఏఐ ఏసీ ప్రారంభ ధర రూ. 55,990. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండింటిలోనూ కొనుగోలు చేయవచ్చు.