RBI New Rules : పాత రూ. 500 రూ. 1000 నోట్లు మళ్లీ మార్చుకోవచ్చా? RBI కొత్త రూల్స్ ఇవేనా? అసలు నిజం ఇదే..!
RBI New Rules : పాత రూ. 500, రూ. 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఆర్బిఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టు వెనుక అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Fact Check RBI New Rules
RBI New Rules : రద్దు చేసిన పాత నోట్లను మళ్లీ మార్చుకోవచ్చా? రూ. 500, రూ. 1000 నోట్లను మళ్లీ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకుంటోందా? ఈ పాత నోట్లకు మార్పునకు ఆర్బీఐ నిజంగా మళ్లీ ఛాన్స్ ఇచ్చిందా? వాస్తవానికి, 2016లో పాత రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ పాత నోట్లను మళ్లీ మార్చుకోవడానికి ఆర్బీఐ మరో (RBI New Rules) అవకాశం ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్త చూసి నిజమే అనుకుని చాలామంది తమ దగ్గర ఉన్న పాత నోట్లు మార్చుకోవచ్చుని అనుకోవచ్చు. ఈ వార్తపై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ పోస్టు వెనుక ఉన్న అసలు నిజాన్ని పీఐబీ (PIB) వెల్లడించింది.
పోస్టులో ఏముందంటే? :
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ ప్రకారం.. ‘పాత రూ. 500 రూ. 1000 రూపాయల నోట్లకు ఆర్బిఐ కొత్త నిబంధనలను జారీ చేసింది. పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి’ అని ఉంది. ఆ పోస్టులో ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫొటో కూడా ఉంది. దాంతో పాటు పాత రూ. 500 రూపాయల నోటు ఫొటో కూడా జత చేసి ఉంది.
అసలు నిజం చెప్పిన పీఐబీ :
ఈ వార్తలో నిజమెంత అనేది పిఐబి తేల్చిచెప్పింది. ఎక్స్ వేదికగా పీఐబీ పోస్టు చేసింది.. ‘ఈ పోస్టు పూర్తిగా అవాస్తవం. ఆర్బీఐ ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ఆర్థిక నిబంధనలు కరెన్సీ సంబంధిత ప్రకటనలపై లేటెస్ట్ సమాచారం కోసం ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ మాత్రమే ఆధారం.’ దీంతో పాటు, పీఐబీ ప్రజలకు విజ్ఞప్తి కూడా చేసింది. ఇలాంటి మెసేజ్ సరిచూసుకోకుండా ఎప్పుడూ ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దు.
Read Also : MacBook Air M4 : సూపర్ డీల్.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఇంత తక్కువా? ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరకే..!
అందరూ జాగ్రత్తగా ఉండండి. విశ్వసనీయమైన అధికారిక సోర్సెస్ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద మెసేజ్, ఫొటోలు లేదా వీడియోలు మీకు వస్తే.. దయచేసి మాకు పంపండి. మేం వాటిపై దర్యాప్తు చేస్తాం.’ అని పేర్కొంది.
Has RBI really announced ‘new rules’ for exchanging old ₹500 & ₹1000 notes❓
Some news reports claim that the Reserve Bank of India (@RBI) has issued new guidelines to exchange discontinued currency notes.#PIBFactCheck
❌ This claim is FAKE!
❌RBI has made NO such… pic.twitter.com/8ph2mlCrLT
— PIB Fact Check (@PIBFactCheck) April 17, 2026
రూ. 500, రూ. 1000 నోట్లను ఎప్పుడు రద్దు చేశారు? :
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 2016 నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను రదద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లో డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు)గా చెబుతారు. పాత రూ. 500 నోటు స్థానంలో ఆర్బిఐ కొత్త రూ. 500 నోటును ముద్రించింది. ప్రస్తుతం ఇవే చలామణీలో ఉన్నాయి. రూ. 1,000 నోటు స్థానంలో రూ. 2,000 నోటు వచ్చింది. అయితే, రూ. 2,000 నోట్లను కూడా రద్దు చేయాలని ఆర్బిఐ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేసే ప్రక్రియ కూడా పూర్తయింది.
ఆర్బీఐ ప్రకారం రూ. 500 నోట్ ఫీచర్లు :
- కింది ఎడమ వైపున ‘500’ అనే వాల్యూ సంఖ్యతో ఒక హైడ్ ఫొటో ఉంది.
- ఇది చూడాలంటే నోటును మీ కంటికి 45-డిగ్రీల కోణంలో పట్టుకోండి.
- నోటును వంచినప్పుడు రంగు దారం ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది.
- మహాత్మా గాంధీ శాలువా మడతపై ‘R’, ‘INDIA’ అనే సూక్ష్మ అక్షరాలు చూడవచ్చు.
- మహాత్మా గాంధీ కళ్లజోడు ఫ్రేమ్‌పై ‘RBI’ అనే సూక్ష్మ అక్షరాలు కనిపిస్తాయి.
- బ్యాంకు నోటుకు ఎడమ వైపున ‘RBI500INDIA’ అనే సూక్ష్మ అక్షరాలు కనిపిస్తాయి.
- లైటుకు ఎదురుగా పట్టుకున్నప్పుడు కాయిన్ రైట్ సైడ్ మహాత్మా గాంధీ ఫొటో, ఎలక్ట్రోటైప్ (500) వాటర్‌మార్క్ కనిపిస్తాయి.
- కాయిన్ ఫ్రంట్ సైడ్ కుడి కిందిభాగంలో రూపాయి ఐకాన్ వాల్యూ సంఖ్య ‘రూ. 500’ కనిపిస్తుంది.
- వంచినప్పుడు సిరా రంగు ఆకుపచ్చ నుంచి బ్లూ కలర్లలోకి మారుతుంది.
- నోటుకు కుడి వైపున ఉబ్బెత్తు అక్షరాలతో ‘500’ అని ఒక సర్కిల్ కూడా చూడవచ్చు.
- దృష్టి లోపం ఉన్నవారికి కాయిన్ ముందు ఎడమ, కుడి వైపులా ఉబ్బెత్తుగా ముద్రించిన 5 బ్లీడ్ లైన్లు కనిపిస్తాయి.
- అశోక స్తంభ చిహ్నంపై ఉబ్బెత్తుగా ఉండే ముద్రణను స్పర్శ ద్వారా తెలుసుకోవచ్చు.
- మహాత్మా గాంధీ ఫొటోపై ఉబ్బెత్తుగా ఉండే ఫ్రింట్ చూడవచ్చు. చేతితో టచ్ చేసి చూడొచ్చు.
- యూవీ లైటింగ్ కింద సెక్యూరిటీ థ్రెడ్ ఫ్లోరోసెన్స్‌ను కూడా చూడొచ్చు
- నోట్ రెండు కలర్ల ఫ్లోరోసెంట్ ఫైబర్లు కనిపిస్తాయి.
- యూవీ కాంతి కింద ‘Rs’, ‘RBI’ అనే అక్షరాలను కూడా చూడొచ్చు.
