MacBook Air M4 : సూపర్ డీల్.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఇంత తక్కువా? ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరకే..!
MacBook Air M4 : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. ఇలా కొన్నారంటే రూ. 85వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు..
MacBook Air M4
- అతి చౌకైన ధరకే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4
- క్రెడిట్ కార్డు, పాత ల్యాప్‌టాప్‌తో భారీ డిస్కౌంట్ ఆఫర్
- 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్, 12MP సెంటర్ స్టేజ్ కెమెరా
MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. మీరు కూడా కొత్త మ్యాక్‌బుక్ కొనాలని చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. పాత జనరేషన్ మోడల్ అయినా ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ రూ. 85వేల లోపు ధరకే మీ సొంతం కావచ్చు.
ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్‌పై డిస్కౌంట్ :
ఆపిల్ M4 చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్ (13-అంగుళాల వేరియంట్) అసలు ధర రూ. 99,900కు పొందవచ్చు. కానీ, ప్రస్తుతానికి, ఈ ల్యాప్‌టాప్ (MacBook Air M4) ఎలాంటి ఆఫర్లు లేకుండా రూ. 96,990కే అమ్ముడవుతోంది. ఈ ల్యాప్‌టాప్ ఇంకా తగ్గింపుతో రూ. 85వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే? పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డు, ఒక పాత ల్యాప్‌టాప్ ఉంటే చాలు.. ఐసీఐసీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ డివైస్‌పై రూ. 5వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత ల్యాప్‌టాప్ ఉంటే.. మీరు రూ. 13వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
అయితే, డిస్కౌంట్ మొత్తం మీ పాత డివైస్ కండిషన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత డివైస్‌ను ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు మీరు మరో రూ. 7వేలు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 2025 మ్యాక్‌బుక్ ఎయిర్ రూ. 85వేల లోపు ధరకే మీ సొంతం కావచ్చు.
ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 అనేది 13 అంగుళాలు, 15 అంగుళాలు అనే 2 స్క్రీన్ సైజులలో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో ల్యాప్‌టాప్ చాలా లైట్ ఉంచుతుంది. ఫ్రంట్ సైడ్ మీకు 500 నిట్స్ వరకు బ్రైట్నెస్కు సపోర్ట్ చేసే లిక్విడ్ రెటినా డిస్ప్లే ఉంది.
Read Also : Aadhaar App : కొత్త స్మార్ట్ఫోన్లలో ‘ఆధార్ యాప్’ ఇక తప్పనిసరి కాదు.. కేంద్రం యూటర్న్.. అసలు రీజన్ ఇదే..!
ఇంటర్నల్ స్ట్రక్షర్ విషయానికి వస్తే.. ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ M4 చిప్‌తో రన్ అవుతుంది. పాత జనరేషన్ మోడల్ అయినా ఇప్పటికీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. యాక్సెసరీలు, ఎక్స్‌ట్రనల్ డిస్ప్లే కనెక్టింగ్ కోసం రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లు కూడా ఉన్నాయి.
వీడియో కాల్స్ సమయంలో ఫ్రేమ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్ చేసే 12MP సెంటర్ స్టేజ్ కెమెరాను కూడా ఆపిల్ అందిస్తోంది.
సాఫ్ట్వేర్ పరంగా.. ఈ ల్యాప్‌టాప్ కొత్త సిరికి సపోర్టు ఇస్తుంది. తద్వారా వాయిస్ టెక్స్ట్, అసిస్టెంట్‌తో చాట్ చేయొచ్చు. సిరి రైటింగ్ టూల్స్‌లో చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్ ద్వారా ఆపిల్ ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. పదేపదే ఛార్జర్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ సమయం ఛార్జింగ్ వస్తుంది.. మీ వర్క్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
