Home Loan EMI Guide : హోం లోన్ కావాలా? రూ. 80 లక్షల ఇంటికి రూ. 20 లక్షల డౌన్ పేమెంట్.. ఎన్నేళ్లకు ఎంత వడ్డీ? నెలకు EMI ఎంతంటే?
Home Loan EMI Guide : హోం లోన్ తీసుకునేవారికి బిగ్ న్యూస్.. మీరు రూ. 80 లక్షల విలువైన ఇంటికోసం లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? ముందుగా రూ. 20 లక్షలు మీ చేతిలో ఉంటే డౌన్ పేమెంట్ కట్టొచ్చు. మిగిలిన రూ. 60 లక్షలకు హోం లోన్ తీసుకోవచ్చు.. నెలకు ఈఎంఐ ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published On : March 25, 2026 / 06:00 AM IST
Home Loan EMI Guide
- హోం లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
- రూ. 80 లక్షల విలువైన ఇంటికి రూ. 20 లక్షల డౌన్ పేమెంట్
- రూ. 60 లక్షల హోం లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ, వడ్డీ ఎంతంటే?
Home Loan EMI Guide : కొత్త ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? బ్యాంకులో హోం లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. మీరు తీసుకునే ఇల్లు రూ. 80 లక్షల విలువ ఉంటే భారీ మొత్తంలో లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు రూ. 20 లక్షల డౌన్ పేమెంట్ కడితే మిగిలిన రూ. 60 లక్షల కోసం హోం లోన్ తీసుకోవాల్సి ఉంటుంది.
మీరు తీసుకునే హోం లోన్ మీ ఆదాయానికి సరిపోతుందా లేదా ముందుగా తెలుసుకోవాలి. మీ ఈఎంఐ అనేది వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, బ్యాంకు నిబంధనల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో రూ. 60 లక్షల గృహ రుణంపై మీ నెలవారీ వాయిదా ఈఎంఐ ఎంత ఉంటుంది? మొత్తం వడ్డీ ఎంత కట్టాలి? అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 60 లక్షల హోంలోన్ 20 ఏళ్ల ఈఎంఐ ఎంతంటే? :
మీరు హోం లోన్ అత్యంత చౌక వడ్డీ రేటుకు తీసుకోండి. హోం లోన్ వడ్డీ రేట్లు మీ సిబిల్ స్కోర్, ఆదాయం, గత లోన్ల ప్రస్తుత ఈఎంఐలు, కాలంపై ఆధారపడి ఉంటాయి. 800 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తాయి.
Read Also : SBI YONO : ఎస్బీఐ YONO కస్టమర్లకు బిగ్ వార్నింగ్.. మీకు ఇలా మెసేజ్ వచ్చిందా? ఈ పొరపాటు అసలు చేయొద్దు..!
కానీ, తుది నిర్ణయం బ్యాంకుదే. మీరు ఒక బ్యాంకు నుంచి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకుంటే.. ప్రారంభ వడ్డీ రేటు ప్రస్తుతం 7.50 శాతంగా ఉన్నట్టయితే ఈ లెక్క ప్రకారం, 20 ఏళ్ల కాలానికి రూ. 60 లక్షల హోంలోన్ ఈఎంఐ లేదా నెలవారీ వాయిదా రూ. 48,336 అవుతుంది. ఈ కాలంలో కేవలం వడ్డీ రూపంలోనే రూ. 5,600,542 చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 60 లక్షల హోం లోన్ 15 ఏళ్ల ఈఎంఐ ఎంతంటే? :
మీరు 7.50 శాతం వడ్డీ రేటుతో 15 ఏళ్ల కాలానికి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకుంటే.. లెక్కల ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ. 55,621 అవుతుంది. ఈ కాలంలో, మీరు వడ్డీగా రూ. 40,11,733 చెల్లించాల్సి ఉంటుంది. లోన్ చెల్లించే కాలం ఎంత తక్కువగా ఉంటే మీరు చెల్లించాల్సిన వడ్డీ అంత తక్కువగా ఉంటుంది.
మీ ఈఎంఐ మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయినా మంచిదే. లోన్ చెల్లించే కాలం ఎంత ఎక్కువగా ఉంటే మీరు చెల్లించాల్సిన వడ్డీ అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ నెలవారీ ఈఎంఐ చాలా తక్కువగా ఉంటుంది. మీరు 30 ఏళ్ల వరకు కూడా హోం లోన్ తీసుకోవచ్చు.
మీ బడ్జెట్‌కు మించి హోం లోన్ తీసుకోవద్దు :
మీ బడ్జెట్‌కు తగినట్టుగా హోం లోన్ తీసుకోవాలి. మంచి నెలవారీ ఆదాయం ఉంటే ఈఎంఐలు మాత్రమే కాదు.. ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు, ఇతర బాధ్యతలను కూడా కవర్ అవుతాయి. అందుకే ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని హోం లోన్ తీసుకోవాలి.
బ్యాంకులు మీ ఆదాయం ఆధారంగా ఎక్కువ హోం లోన్ మొత్తాన్ని అందిస్తాయి. మీరు అంతకంటే ఎక్కువ హోం లోన్ పొందలేరు. అందుకే సాధ్యమైనంత తక్కువ హోం లోన్ తీసుకోవడం బెటర్.
