Honda Car Discounts : ఈ హోండా కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఏకంగా రూ.1.97 లక్షలు తగ్గింపు.. అమేజ్ నుంచి హోండాసిటీ వరకు..

Honda Car Discounts : హోండా కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త కారు కొనుగోలుపై లక్షల్లో ఆదా చేసుకోవచ్చు. ఈ ఏప్రిల్ నెలలో అమేజ్ నుండి హోండా సిటీ వరకు మోడళ్లపై రూ. 1.97 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.

Honda Car Discounts

  • హోండా కార్లపై ఆఫర్లే ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
  • ఏప్రిల్ 2026లో ఈ హోండా కారు మోడళ్లపై భారీ తగ్గింపు
  • ఈ కార్ల కొనుగోలుపై రూ.1.97 లక్షల వరకు ఆదా

Honda Car Discounts : హోండా కారు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ ఏప్రిల్‌లో హోండా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీకోసం అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్.. ప్రస్తుతం కంపెనీ పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త కారు కొనేవారు లక్షల్లో ఆదా చేసుకోవచ్చు. హోండా అనేక మోడళ్లపై రూ. 1.97 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హోండా అమేజ్ డిస్కౌంట్ ఆఫర్లు :
ప్రస్తుతం హోండా అమేజ్‌పై కొన్ని ఆకట్టుకునే (Honda Car Discounts April 2026) ఆఫర్లను అందిస్తోంది. సెకండ్ జనరేషన్ హోండా అమేజ్‌పై రూ. 58వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉండగా, థర్డ్ జనరేషన్ హోండా అమేజ్‌పై రూ. 68వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

హోండా సిటీ డిస్కౌంట్ ఆఫర్లు :
కంపెనీ ఫ్లాగ్‌షిప్ సెడాన్ హోండా సిటీపై ప్రస్తుతం రూ. 1.56 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ కారు కొనుగోలుపై అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.

Read Also : Whatsapp Username : వాట్సాప్‌లో కొత్త ‘యూజర్‌నేమ్’ ఫీచర్.. ఇక ఫోన్ నంబర్‌ లేకుండానే చాట్ చేయొచ్చు.. ఎలా వాడాలంటే?

Honda Car Discounts : హోండా సిటీ హైబ్రిడ్ (e:HEV) డిస్కౌంట్ ఆఫర్లు :
హోండా సిటీ హైబ్రిడ్ (e:HEV)పై ప్రస్తుతం రూ. 1.97 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీరు ఈ కారుపై రూ. 2 లక్షల వరకు ఆదా చేయొచ్చు.

హోండా ఎలివేట్ డిస్కౌంట్ ఆఫర్లు :
ఈ నెలలో హోండా ఎలివేట్‌పై కంపెనీ రూ. 1.51 లక్షల వరకు డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. అందుకే, మీరు ఈ కారును కూడా కొనుగోలు చేయొచ్చు.

  • హోండా అమేజ్ (పాత మోడల్) : రూ. 58,000
  • హోండా అమేజ్ (కొత్త మోడల్) : రూ. 68,000
  • హోండా సిటీ : రూ. 1.56 లక్షలు
  • హోండా సిటీ హైబ్రిడ్ : రూ. 1.97 లక్షలు
  • హోండా ఎలివేట్ : రూ. 1.51 లక్షలు