Honda Car Discounts : ఫ్యామిలీ కారు కొనాలా? అమేజ్, సిటీ, ఎలివేట్‌పై హోండా జాక్‌పాట్ ఆఫర్స్.. రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్

Honda Car Discounts : భారత మార్కెట్లో హోండా పలు మోడళ్లపై రూ. 2.15 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ తగ్గింపులు హోండా అమేజ్, ఎలివేట్, హోండా సిటీ వంటి కార్లపై లభ్యమవుతున్నాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Honda Car Discounts

  • మే నెలలో హోండా కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లు
  • హోండా అమేజ్, సిటీ, ఎలివేట్ కార్లపై మరెన్నో ఆఫర్లు
  • ఈ కార్లపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు

Honda Car Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ మే నెలలో హోండా కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కార్ మేకర్ హోండా అనేక ప్రముఖ కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇప్పుడు హోండా కారు కొంటే ఏకంగా లక్షల్లో ఆదా చేయొచ్చు.

భారత మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పోటీ నేపథ్యంలో వినియోగదారులను (Honda Car Discounts) ఆకర్షించేందుకు కంపెనీ అనేక మోడళ్లపై రూ. 2.15 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ తగ్గింపులు హోండా అమేజ్, ఎలివేట్ హోండా సిటీ వంటి కార్లపై అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హోండా సిటీ మే 2026 తగ్గింపు ఆఫర్లు :

  • కొత్త హోండా అమేజ్ : రూ. 67వేల వరకు ఆఫర్లు
  • సెకండ్ హ్యాండ్ హోండా అమేజ్ : రూ. 58వేల వరకు ఆఫర్లు
  • హోండా సిటీ : రూ. 1.56 లక్షల వరకు తగ్గింపు
  • హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ : రూ. 1.97 లక్షల వరకు తగ్గింపు
  • హోండా ఎలివేట్ : రూ. 2.15 లక్షల వరకు తగ్గింపు

ఈ హోండా ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, ఇతర డీలర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్లన్నింటి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

Read Also : Instagram Instants : బాబోయ్ మాకొద్దు.. ఇన్‌స్టాలో కొత్త ‘ఇన్‌స్టంట్స్’ఫీచర్ టెన్షన్ పెడుతోందా?.. ఈ సెట్టింగ్ మార్చితే చాలు..!

  • హోండా అమేజ్ : రూ. 7.51 లక్షలు
  • హోండా సిటీ : రూ. 11.99 లక్షలు
  • హోండా సిటీ e:HEV : రూ 19.99 లక్షలు
  • హోండా ఎలివేట్ : రూ. 11.59 లక్షలు

హోండా ఎలివేట్ డిస్కౌంట్ ఆఫర్లు :
హోండా ఎలివేట్ కంపెనీ అత్యంత పాపులర్ SUV కార్లలో ఒకటి. భారత మార్కెట్లో SUV సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకే.. హోండా ఈ మోడల్‌పై రూ. 2.15 లక్షల వరకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలలో కంపెనీ కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా లాంచ్ చేస్తోంది. కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మే 22న లాంచ్ కావచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయి.

ఆటో ఇండస్ట్రీ సియామ్ (SIAM) డేటా ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో హోండా దేశీయ అమ్మకాలు 6.04 శాతం తగ్గి 61,943 యూనిట్లకు పడిపోతాయని అంచనా. కంపెనీ మార్కెట్ వాటా కూడా 2025 ఆర్థిక సంవత్సరంలో 1.53 శాతానికి, 2026 ఆర్థిక సంవత్సరంలో 1.33 శాతానికి తగ్గుతుందని అంచనా.