Honda NX500 : కొత్త హోండా ఇ-క్లచ్ బైక్ వచ్చేసింది.. ఇకపై క్లచ్ లేకుండానే గేర్లు మార్చొచ్చు.. ధర జస్ట్ ఎంతంటే?

Honda NX500 : హోండా నుంచి భారత మార్కెట్లోకి ఇ-క్లచ్‌తో కొత్త NX500 అడ్వెంచర్ టూరర్ బైక్‌ వచ్చేసింది. ఈ బైక్ క్లచ్ లివర్‌ వాడకుండానే గేర్లను మార్చవచ్చు.. ఇంకా ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

Honda NX500 (Image Credit : Gemini AI )

  • హోండా ఎన్ఎక్స్500 ఇ-క్లచ్ బైక్ లాంచ్
  • క్లచ్ లేకుండా ఈజీగా ఈ బైక్ గేర్లను మారవచ్చు
  • హోండా కొత్త బైక్ ఇక క్లచ్ లేదు, టెన్షన్ లేదు, జస్ట్ రైడ్..
  • ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలివే

Honda NX500 : హోండా బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లో ఇ-క్లచ్‌తో NX500 అడ్వెంచర్ టూరర్‌ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.44 లక్షలు ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో క్లచ్ లివర్ వాడకుండానే గేర్లు మార్చవచ్చు. అయితే, మోటార్‌సైకిల్ డిజైన్ మెకానికల్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మిగతావన్నీ యథాతథంగా ఉన్నాయి.

హోండా NX500 ఇ-క్లచ్ సపోర్టు :
ఈ హోండా NX500 ఇ-క్లచ్ సిస్టమ్ 2 ఎలక్ట్రానిక్ యాక్యుయేటర్లతో వస్తుంది. ఈ యాక్యుయేటర్లు గేర్లు మార్చేటప్పుడు క్లచ్‌ను ఆటోమేటిక్‌గా ఎంగేజ్ చేస్తాయి. బైక్ ఆగి, మళ్లీ మూవ్ అయ్యే సమయంలో కూడా ఈ సిస్టమ్ వర్క్ అవుతూనే ఉంటుంది. అయినప్పటికీ, రైడర్ క్లచ్ లివర్ గేర్ పెడల్స్‌ ద్వారా గేర్లను మాన్యువల్‌గా మార్చుకుంటూ డ్రైవింగ్ చేయొచ్చు.

ఇ-క్లచ్ టెక్నాలజీ కారణంగా ఈ బైక్ బరువుకు 3కిలోగ్రాములు అదనంగా మొత్తం బరువు 199 కిలోగ్రాములు ఉంటుంది. హోండా ఇటీవల CB650R, CBR650R బైక్‌లను ఇ-క్లచ్ ఆప్షన్‌తో తీసుకొచ్చింది. కానీ, గత బ్యాచ్‌లోని అన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ బైక్‌లు ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో లేవు.

Read Also : Best Smartphones : రూ. 30 వేల బడ్జెట్‌లో వన్‌ప్లస్, వివో, రియల్‌మి.. కెమెరా, బ్యాటరీ, గేమింగ్‌లో అసలు బెస్ట్ ఫోన్ ఏది?

హోండా NX500 స్పెసిఫికేషన్లు :
హోండా NX500 ఫేమిలర్ బైక్ మెకానికల్ పార్టులతో వస్తుంది. 471cc, ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో రన్ అవుతుంది. 8,500rpm వద్ద 47hp, 6,500rpm వద్ద 43Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్‌లో 6 గేర్లు ఉన్నాయి. అయితే, క్లచ్‌లో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఈ బైక్‌లో ఫ్రంట్ సైడ్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్క్‌లు, బ్యాక్ సైడ్ మోనోషాక్ ఉన్నాయి.

హోండా NX500 బైక్ ఫ్రంట్ సైడ్ 19-అంగుళాల బ్యాక్ సైడ్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది. బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ ఉంది. ఫ్రంట్ సైడ్ రేడియల్‌గా అమర్చిన నిస్సిన్ కాలిపర్‌లతో రెండు 296mm డిస్క్ బ్రేక్‌లతో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో సింగిల్ 240mm డిస్క్ బ్రేక్ ఉంది.

ఇందులో 5-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, స్విచ్‌గేర్ ఉన్నాయి. అలాగే, ఈ స్కూటర్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్ మాత్రమే ఉన్నాయి. రైడింగ్ మోడ్‌లు లేదా అదనపు గాడ్జెట్‌ల వంటి అడ్వాన్స్ ఫీచర్లు ఇందులో లేవు. కేబుల్ ద్వారా రన్ అయ్యే థ్రాటిల్‌ మాత్రమే ఉంది.