EPF Interest : మీ PF ఖాతాలో రూ. 2 లక్షలు ఉంటే.. ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లిస్తుంది? లెక్క తెలిస్తే షాక్ అవుతారు!
EPF Interest : ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటును 8.25శాతంగా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంతో సమానంగానే ఉంది. అంటే.. అటు పెంచలేదు.. ఇటు తగ్గించనూ లేదు.
EPF Interest
- ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటు
- పీఎఫ్ వడ్డీని నెలవారీగా కాంపౌండింగ్ పద్ధతి ద్వారా లెక్కిస్తారు
- రూ. 2 లక్షల పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కింపు ఎలాగంటే?
EPF Interest : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉంది? చెక్ చేసుకున్నారా? అసలు ఎంత ఫండ్ ఉంటే ఎంత వడ్డీ వస్తుంది? ప్రభుత్వం ఈ వడ్డీని ఎలా లెక్కిస్తుంది? అనేది మీకు తెలుసా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేట్లను ప్రకటించింది.
మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నా లేదా మీ పీఎఫ్ మీ జీతం నుంచి నెలవారీగా కట్ అవుతున్నా ఇకపై ఆ డిపాజిట్‌పై కూడా మీకు వడ్డీ వస్తుంది. ప్రతి ఏడాదిలో మీ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బుపై వడ్డీ లభిస్తుంది. మీ పీఎఫ్ ఖాతాలో లక్షల రూపాయలు ఉంటే భారీ మొత్తంలో వడ్డీని పొందవచ్చు.
పీఎఫ్ డబ్బుపై ఎంత వడ్డీ లభిస్తుంది?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డబ్బుపై ఎంత వడ్డీ లభిస్తుందంటే.. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించింది . గత ఆర్థిక సంవత్సరంలో కూడా వడ్డీ రేటు ఇదే విధంగా ఉంది. అంటే.. ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుంది.
పీఎఫ్ డబ్బుపై వడ్డీ ఎలా సంపాదించాలి? :
పీఎఫ్‌పై వడ్డీని నెలవారీగా చెల్లిస్తారు. మీ పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నెలవారీ మొత్తాన్ని మునుపటి బ్యాలెన్స్‌ను నెలవారీగా లెక్కించి ఆ వడ్డీని ఒకేసారి చెల్లిస్తారు. అంటే.. ఇక్కడ చక్రవడ్డీ విధానం ఆధారంగా మీ పీఎఫ్ వడ్డీ మొత్తం దానికి అనుగుణంగా పెరుగుతుంది.
వడ్డీని ఆర్థిక సంవత్సరం ఆధారంగా చెల్లిస్తారు. అంటే.. మీ పీఎఫ్ ఫండ్స్ పై వడ్డీ ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు ఉన్న కాలానికి వర్తిస్తుంది. ప్రభుత్వం నెలవారీ వడ్డీని లెక్కించి దానిని ఒకేసారి మీ ఖాతాలో జమ చేస్తుంది అనమాట.
పీఎఫ్ డబ్బుపై వడ్డీ లెక్కింపు ఇలా :
పీఎఫ్ వడ్డీ లెక్కింపు ఫార్ములా : (మంత్లీ ఎండింగ్ బ్యాలెన్స్ × వార్షిక వడ్డీ రేటు ÷ 100) ÷ 12
ఇప్పుడు మీ ఫస్ట్ నెల ఎండింగ్ బ్యాలెన్స్ రూ. 2 లక్షలు అనుకుందాం.. అప్పుడు నెలవారీ వడ్డీ (200000 * 8.25%)/12 అవుతుంది. ఇప్పుడు ఇందులో శాతాన్ని తీసివేసేందుకు 100తో భాగించాలి. అప్పుడు ఈ విధంగా (1650000/100)/12 అవుతుంది.
= 16500/12
= 1375 వార్షిక వడ్డీ
వచ్చే ఏప్రిల్‌లో మీ పీఎఫ్ బ్యాలెన్స్ రూ. 2 లక్షలు ఉంటే.. ఆ నెలలో మీకు రూ. 1,375 వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని ఇప్పుడు మే నెల బ్యాలెన్స్ కు కలిపి మే నెల ఎండింగ్ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. అదే విధంగా, 12 నెలల వడ్డీని తీసివేసి ఒకేసారి మొత్తం మీ ఖాతాకు వడ్డీ యాడ్ అవుతుంది. ఇలానే పీఎఫ్ వడ్డీని లెక్కిస్తారు.
