Skoda Kushaq Facelift : కొత్త స్కోడా కుషాక్ వచ్చేసింది. ఈ కారుకు డౌన్ పేమెంట్ ఎంత? నెలకు EMI ఎంత కట్టాలి? పూర్తి లెక్కలివే!
New Skoda Kushaq Facelift : రూ. 10.69 లక్షల ప్రారంభ ధరతో కొత్త స్కోడా కుషాక్ ప్రీమియం ఫీచర్లతో వచ్చింది. బేస్ వేరియంట్లో సన్‌రూఫ్ 1.0, 1.5 TSI ఇంజన్లు, అద్భుతమైన మైలేజ్, 5-స్టార్ రేటింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈఎంఐతో ఈ కారు కొనాలంటే ఎంత చెల్లించాలో ఇప్పుడు చూద్దాం..
New Skoda Kushaq Facelift
- భారత మార్కెట్లోకి కొత్త స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ లాంచ్
- రూ. 10.69 లక్షల ప్రారంభ ధరతో స్కోడా కుషాక్
- 5 స్టార్ రేటింగ్, బేస్ వేరియంట్ సన్ రూఫ్ ఆప్షన్లు
- స్కోడా కుషాక్ డౌన్ పేమెంట్, ఈఎంఐ వివరాలు
New Skoda Kushaq Facelift : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త అవతార్‌లో స్కోడా కుషాక్ లాంచ్ అయింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 10.69 లక్షలుగా నిర్ణయించింది. బేస్ వేరియంట్ నుంచే సన్‌రూఫ్‌తో కుషాక్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఈ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి పోటీదారులతో నేరుగా పోటీపడుతుంది. మీరు ఈ కారును కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. స్కోడా కుషాక్ ఆన్-రోడ్ ధర, ఈఎంఐ వివరాలు, డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్, మైలేజ్ వంటి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
స్కోడా కుషాక్ ఆన్ రోడ్ ధర ఎంతంటే? :
మీరు ఢిల్లీలో కొత్త కుషాక్‌ను కొనుగోలు చేస్తే.. ఎక్స్-షోరూమ్ ధర రూ. 10,69,000గా ఉంటుంది. అదనంగా, ఆర్టీఓ ఫీజుల కోసం రూ. 1,18,900, ఇన్సూరెన్స్ కోసం రూ. 46,483 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. టీసీఎస్ కోసం రూ. 10,690, ఫాస్ట్ ట్యాగ్ కోసం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్-రోడ్ ధర రూ. 12,45,573 అవుతుంది.
స్కోడా కుషాక్ డౌన్ పేమెంట్, ఈఎంఐ వివరాలు :
ఈ స్కోడా కారు ఆన్-రోడ్ ధరపై రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేశారనుకుందాం.. మిగిలిన రూ. 10,45,573 కోసం మీరు కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు నెలవారీ ఆదాయం, మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఈ లోన్‌ను 10 శాతం వడ్డీ రేటుతో ఈజీగా పొందవచ్చు.
Read Also : LPG ATM : గ్యాస్ టెన్షన్‌కు చెక్.. దేశంలోనే ఫస్ట్ LPG ఏటీఎం.. జస్ట్ 2 నిమిషాల్లోనే సిలిండర్ ఇంటికి..!
ఈ కారు లోన్ 5 ఏళ్ల వ్యవధిలో రూ. 22,215 చొప్పున 60 ఈఎంఐలతో తిరిగి చెల్లించవచ్చు. అంటే.. మీరు ఈఎంఐలలో మొత్తం రూ. 13,32,920 చెల్లించాల్సి ఉంటుంది. మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌ను కూడా కలిపితే 5 ఏళ్ల తర్వాత మొత్తం రూ. 15,32,920 అవుతుంది. అప్పుడు వడ్డీ రూ. 2,87,347గా ఉంటుంది.
డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లు :
స్కోడా కుషాక్ కారులో కొత్త గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్ లైట్ బార్, అడ్జెస్ట్ ఫ్రంట్, బ్యాక్ బంపర్లు, ఎల్ఈడీ టెయిల్లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. యూరోపియన్-స్టయిల్ డిజైన్ అందిస్తుంది.
ఇంటర్నల్ డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, 10.25-అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రియర్ మసాజర్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. భారీ క్యాబిన్, 491 లీటర్ల బూట్ స్పేస్ ఒక ఫ్యామిలీకి సరిగ్గా సరిపోతుంది.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ : ధరల వివరాలు
| వేరియంట్ | 1.0 TSI MT | 1.0 TSI AT | 1.5 TSI DSG |
|---|---|---|---|
| క్లాసిక్+ | రూ. 10,69,000 | రూ. 12,69,000 | – |
| సిగ్నేచర్ | రూ. 14,59,000 | రూ. 15,59,000 | – |
| స్పోర్ట్‌లైన్ | రూ. 14,74,000 | రూ. 15,74,000 | – |
| ప్రెస్టీజ్ | రూ. 16,79,000 | రూ. 17,59,000 | రూ. 18,79,000 |
| మోంటె కార్లో | – | రూ. 17,89,000 | రూ. 18,99,000 |
ఇతర ఫీచర్లలో గూగుల్ ఏఐ కంపానియన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 6-స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లలో 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 25+ యాక్టివ్-పాసివ్ ఫీచర్లు (టాప్ వేరియంట్లో 40+), ఏబీఎస్, ఈబీబీ, ఈఎస్సీ, టీపీఎంఎస్, హిల్ హోల్డ్ ఉన్నాయి. 1.0 టీఎస్ఐ (115 పీఎస్, 178Nm) 6MT/కొత్త 8AT, 1.5 TSI (150 PS, 250Nm) 7-స్పీడ్ DSG ఇంజిన్లతో కొనుగోలు చేయవచ్చు. టాప్ మైలేజ్ 19.76kmpl అందిస్తుంది.
Note: స్కోడా కుషాక్ ఆన్-రోడ్ ధర, ఈఎంఐ వివరాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీ సిటీ, డీలర్షిప్, వాహన మోడల్, బీమా కంపెనీ, వడ్డీ రేటును బట్టి వివరాలు మారవచ్చు. మీరు నెలకు రూ. 60వేల నుంచి రూ. 80వేలు సంపాదిస్తూ ఎలాంటి లోన్లు లేకుంటే మాత్రమే ఈఎంఐలో ఈ కారును కొనడం బెటర్.
