JioTag 2 : మీ పర్సు, తాళాలు, లగేజీ పోయాయా? ఇక టెన్షన్ వద్దు.. JioTag 2తో ఈజీగా కనిపెట్టొచ్చు!

JioTag 2 : జియోట్యాగ్ 2 అనే డివైజ్ గూగుల్ ఫైండ్ హబ్, ఆపిల్ ఫైండ్ మై ద్వారా కనెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సబ్‌స్క్రిప్షన్ లేకుండానే వస్తువులను గుర్తించవచ్చు.

JioTag 2 Specifications

  • జియోట్యాగ్ 2 డివైజ్ భలే ఉందిగా
  • మీ వ్యాలెట్, కీ, లగేజీని ఈజీగా గుర్తిస్తుంది
  • ఈ డివైజ్ మీ వస్తువులను ఎలా ట్రాక్ చేస్తుందంటే?

JioTag 2 : మీ పర్సు మర్చిపోయారా? బండి కీ లేదా ఏదైనా లగేజీ ఎక్కడ పెట్టారో గుర్తులేదా? డోంట్ వర్రీ.. ట్రావెల్ సమయంలో మీ వస్తువు ఎక్కడ పారేసుకున్నా ఈజీగా కనిపెట్టొచ్చు. సాధారణంగా ప్రతిఒక్కరూ రోజూ వాడే పర్సు, కీ లేదా లగేజీ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. చాలా మందికి ఇలాంటి సమస్యే ఎదురవుతుంది.

అలాంటి పరిస్థితుల్లో వస్తువులను ఈజీగా గుర్తించేందుకు జియోట్యాగ్ 2 అనే బ్లూటూత్ ట్రాకర్ అద్భుతంగా (JioTag 2) ఉపయోగపడుతుంది. వాస్తవానికి, ఈ డివైస్ ధర రూ. 1,249 ధర మాత్రమే.. ఆండ్రాయిడ్ యూజర్లకు Google Find Hub, ఐఫోన్ యూజర్లకు Apple Find My సర్వీసులతో వర్క్ అవుతుంది. సిమ్ కార్డు, మొబైల్ డేటా లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అక్కర్లేదు.

మీ వస్తువులను ఎలా ట్రాక్ చేస్తుందంటే? :
జియోట్యాబ్ 2ను పర్సు, తాళాలు, బ్యాక్‌ప్యాక్ లేదా లగేజీకి అమర్చితే చాలు.. అది బ్లూటూత్ ద్వారా మీ ఫోన్‌తో కనెక్ట్ అవుతుంది. వస్తువు మీకు దగ్గరగా ఉంటే యాప్‌లో నుంచి 120 డెసిబెల్స్ బజర్ మోగించి ఈజీగా గుర్తించవచ్చు.

Read Also : Samsung Galaxy S25 FE 5G : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ శాంసంగ్ కొత్త 5G ఫోన్ మరి ఇంత తక్కువా.. ఈ డీల్ మిస్ చేయొద్దు!

సోఫా కింద మరో బ్యాగ్‌లో లేదా ఇంట్లో ఎక్కడైనా మర్చిపోయినా సౌండ్ ద్వారా త్వరగా కనిపెట్టవచ్చు. ఒకవేళ వస్తువు బ్లూటూత్ రేంజ్ దాటి వెళ్లినా కూడా మీ సమీపంలో ఉన్న ఇతర సపోర్టెడ్ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ డివైజ్ సాయంతో చివరిగా గుర్తించిన లొకేషన్ యాప్‌లో అప్‌డేట్ అవుతుంది. అలాగే లాస్ట్ మోడ్ ఆన్ చేస్తే ట్రాకర్ గుర్తించినప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంది.

ఏయే వస్తువులకు ఎక్కడ వాడొచ్చంటే? :

  • పర్సులు, వాలెట్లు
  • ఇంటి, వాహన తాళాలు
  • బ్యాక్‌ప్యాక్‌లు, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు
  • సూట్‌కేసులు, ట్రావెల్ లగేజీ
  • కెమెరా, ఇతర డివైజ్ కేసులు

జియోట్యాబ్ 2కు ఐపీ64 రేటింగ్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇందులో బ్యాటరీ సుమారు ఒక ఏడాది వరకు పనిచేస్తుందని కంపెనీ అంటోంది. అదనపు బ్యాటరీ కూడా బాక్స్‌లో అందిస్తుంది.

జియోట్యాగ్ 2 ఏం చేయలేదంటే? :
జియోట్యాగ్ 2 అనేది లైవ్ జీపీఎస్ ట్రాకర్ కాదు. కేవలం వాహనాలు, పెంపుడు జంతువులు, పిల్లలు లేదా వృద్ధులను ట్రాక్ చేసేది కాదు.. మీ సమీపంలో సపోర్టు చేసే డివైజ్ ఉన్నప్పుడు మాత్రమే చివరిగా గుర్తించిన లొకేషన్‌ను చూపిస్తుంది.. అంటే, ఎక్కువగా మర్చిపోయే వస్తువుల్లో పర్సు, తాళాలు, లగేజీ వంటివి గుర్తించేందుకు ఈజీగా స్మార్ట్ ట్రాకర్ ద్వారా కనిపెట్టొచ్చు అంతే..