×
Ad

Maruti Suzuki e Vitara : కొత్త మారుతి EV కారు కావాలా? రూ.3 లక్షలు కడితే చాలు.. ఇ-విటారా ఇంటికి.. నెలకు EMI ఎంతంటే?

Maruti Suzuki e Vitara : మారుతి సుజుకి ఇ-విటారా నెలవారీ ఈఎంఐతో వస్తుంది. కొనుగోలుపై ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాలో ఇప్పుడు చూద్దాం.. పూర్తి వివరాలను తెలుసుకుందాం..

  • Published On : February 23, 2026 / 04:56 PM IST

Maruti Suzuki e Vitara

  • మారుతి సుజుకి ఇ-విటారా మీ బడ్జెట్ ధరలోనే
  • మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఎలా కొనాలి?
  • ఇ-విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షలు
  • రూ.14.03 లక్షల లోన్, రూ. 3 లక్షల డౌన్ పేమెంట్

Maruti Suzuki e Vitara : కొత్త కారు కొంటున్నారా? మీరు మారుతి కారు లవర్స్ అయితే ఇది మీకోసమే. దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు మారుతి సుజుకి ఇ-విటారా అమ్మకానికి రెడీగా ఉంది. మారుతి సుజుకి ఇ-విటారా మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఇ-విటారా ఎలా కొనుగోలు చేయాలి? ప్రతి నెలవారీ ఈఎంఐ ఎంత చెల్లించాలి? పూర్తి లెక్కలను వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఇ-విటారా ధర :
ముందుగా, మారుతి సుజుకి ఇ-విటారా ధర విషయానికి వస్తే.. మారుతి సుజుకి ఇ-విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షలు. ఈ ఇ-విటారా ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు ఉంటుంది.

మీరు ఢిల్లీలో మారుతి సుజుకి ఇ-విటారా బేస్ వేరియంట్‌ కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ కోసం రూ. 16వేలు, ఇన్సూరెన్స్ కోసం రూ. 71వేలు, ఇతర ఛార్జీల కోసం రూ. 16వేలు చెల్లించాలి. ఆ తర్వాత, మారుతి సుజుకి ఇ-విటారా ఆన్-రోడ్ ధర సుమారు రూ. 17.02 లక్షలు అవుతుంది.

Read Also : iPhone 17e Price : ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 17e వచ్చేస్తోందోచ్, లాంచ్‌కు ముందే ధర, ఫుల్ ఫీచర్లు లీక్

నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
మారుతి సుజుకి ఇ-విటారా బేస్ వేరియంట్‌ కొనుగోలుపై రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే.. బ్యాంకు నుంచి రూ.14.03 లక్షల లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ లోన్ 9 శాతం వడ్డీ రేటుతో 7 ఏళ్ల కాలానికి బ్యాంకు నుంచి పొందవచ్చు. అప్పుడు మీరు నెలకు రూ. 22,573 ఈఎంఐగా చెల్లించాలి. అంటే.. మీరు మొత్తం రూ. 18.96 లక్షలను బ్యాంకుకు తిరిగి చెల్లించాలి.

మారుతి సుజుకి ఇ-విటారా బ్యాటరీ :
మారుతి సుజుకి ఇ-విటారా 2 బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ 49kWh బ్యాటరీ, 105.8kW పవర్ ఉత్పత్తి చేస్తుంది. రెండో ఆప్షన్ 61kWh బ్యాటరీ, 128kW పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఆప్షన్లలో 192.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. 61kWh వేరియంట్ 543 కి.మీ రేంజ్ అందిస్తుంది. అయితే, 49kWh వేరియంట్ 440 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది.