BoB FD Interest : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ బ్యాంకులో 400 రోజుల FDపై భారీగా వడ్డీ సంపాదించుకోవచ్చు.. !

BoB FD Interest : మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీ ఖాతాను కూడా ఓపెన్ చేయొచ్చు.. కనీసం ఎన్ని రోజులకు ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు? ఎంత వడ్డీ వస్తుంది?

  • Published on- September 12, 2026 / 09:16 PM IST

BoB FD Interest

  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా?
  • 400 రోజుల ఎఫ్ డీ ఖాతాపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
  • ఎఫ్‌డీ ఖాతాలపై 3.50శాతం నుంచి 7.35శాతం వరకు వడ్డీ

BoB FD Interest : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఆఫ్ బరోడాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయడం బెటర్.. ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తమ కస్టమర్లకు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంకులో వివిధ మెచ్యూరిటీ టెన్యూర్లతో ఎఫ్‌డీ ఖాతాలపై 3.50శాతం నుంచి 7.35శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.

అకౌంట్ ఓపెన్ ఎన్ని రోజులంటే? :
బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనీసం 7 రోజుల కాలపరిమితితో ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే, మీరు ఈ బ్యాంకులో గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 400 రోజుల ఎఫ్‌డీఖాతాలపై ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

400 రోజుల ఎఫ్‌డీపై వడ్డీ ఎంతంటే? :
బ్యాంక్ ఆఫ్ బరోడా 400 రోజుల ఎఫ్‌డీ పథకంపై 6.25 శాతం నుంచి 6.85 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 59 ఏళ్ల వయస్సు ఉన్న కస్టమర్లకు 400 రోజుల ఎఫ్‌డీ ఖాతాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా 6.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ప్రభుత్వ బ్యాంకు 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు 400 రోజుల ఎఫ్‌డీ పథకంపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది.

Read Also : Nubia NaviX Ultra Launch : పవర్‌కు కొత్త బెంచ్‌మార్క్.. 7,100mAh బ్యాటరీతో నుబియా నావిక్స్ అల్ట్రా.. వచ్చే వారమే గ్రాండ్ ఎంట్రీ!

అంతేకాదు.. 80 ఏళ్లు, ఆపై ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు 400 రోజుల ఎఫ్‌డీ పథకంపై ఈ ప్రభుత్వ బ్యాంకు 6.85 శాతం బంపర్ వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో వినియోగదారులు గరిష్టంగా రూ. 3 కోట్లు పెట్టుబడి పెట్టవచ్చు.

వయోవృద్ధులకు బెనిఫిట్స్ ఏంటి? :
బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు FD ఖాతాలపై 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తుంది. అంతేకాదు.. ఎంపిక చేసిన మెచ్యూరిటీ కాలపరిమితులతో ఎఫ్‌డీ ఖాతాలపై ఇతర సీనియర్ సిటిజన్లతో పోలిస్తే సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.10 శాతం అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది.

జూన్‌లో ఎఫ్‌డీ వడ్డీ రేట్ల సవరణ :
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఏడాది జూన్‌లో FD వడ్డీ రేట్లను సవరించింది. దేశంలోని అన్ని బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రెపో రేటు ఆధారంగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సర్దుబాటు చేస్తాయి.