PF Claim Online : ఉద్యోగులకు పండగే.. ఇక కంపెనీతో పనిలేదు.. PF డబ్బులు ఈజీగా తీసుకోవచ్చు.. ఎలాగంటే?
PF Claim Online : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు తమ కంపెనీ నుంచి అనుమతి లేకుండానే ఆన్‌లైన్‌లో పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- May 20, 2026 / 07:31 PM IST
PF Claim Online ( Image Credit : AI )
- ఈపీఎఫ్ఓ ఉద్యోగుల కోసం పీఎఫ్, పెన్షన్ బీమాను అందిస్తుంది
- కంపెనీ అనుమతి లేకుండానే ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు
- కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి.. ఆధార్, పాన్, బ్యాంక్ లింక్ అయి ఉండాలి
PF Claim Online : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ పీఎఫ్ డబ్బులను మీరు పనిచేసే కంపెనీ పర్మిషన్ లేకుండా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.అయితే, దీనికి కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి. కొత్త ఈపీఎఫ్ఓ 3.0 ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఇప్పుడు కంపెనీ అనుమతి లేకుండానే పీఎఫ్ విత్‌డ్రాలు చేసుకోవచ్చు. గతంలో, చాలా పీఎఫ్ క్లెయిమ్‌లకు కంపెనీ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండేది.
తద్వారా క్లెయిమ్ ప్రాసెస్ చాలా ఆలస్యమయ్యేది. ఈ సంస్థ ఇప్పుడు ఆధార్-లింక్డ్ అథెంటికేషన్‌ను సిస్టమ్‌లో లింక్ చేసింది. తద్వారా EPFO, OTP-ఆధారిత సిస్టమ్ ద్వారా ఖాతాదారులను వెరిఫై చేస్తుంది. మీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలని చూస్తుంటే కంపెనీ అనుమతి లేకుండా విత్‌డ్రా చేసుకునే సింపుల్ ప్రాసెస్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Read Also : Samsung Galaxy A37 5G : అమెజాన్‌లో శాంసంగ్ 5G ఫోన్ బంపర్ ఆఫర్.. ఈ డీల్ మిస్ అయితే మళ్లీ దొరకదు బ్రో..!
మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు సరిగ్గా లింక్ అయి వెరిఫై చేసి ఉండాలి. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా OTP ఆధారిత వెరిఫికేషన్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా ప్రాసెస్ ఈజీగా పూర్తి చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో PF క్లెయిమ్ కోసం ఎలా అప్లయ్ చేయాలి? :
- మీరు EPFO మెంబర్ పోర్టల్‌ను విజిట్ చేయండి. మీ UANను యాక్టివేట్ చేసుకోండి.
- మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ అయిందో లేదో కన్ఫార్మ్ చేసుకోండి.
- ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు అప్‌డేట్ అయ్యాయా? చెక్ చేయండి.
- కేవైసీ సెక్షన్ ఓపెన్ అన్ని వెరిఫై అయ్యాయో లేదో చూడండి.
- ఈపీఎఫ్ఓ మెంబర్ ఇ-సర్వీస్ పోర్టల్ ఓపెన్ చేసి మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- ఆపై మీరు మేనేజ్ సెక్షన్‌కు వెళ్లి KYC ఆప్షన్ ఎంచుకోండి.
- మీ ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు వెరిఫై అయ్యాయో లేదో చెక్ చేసుకోండి.
- క్లెయిమ్ సబ్మిట్ చేసే ముందు ఆన్‌లైన్ సర్వీసుకు వెళ్లి ఆపై క్లెయిమ్‌కు వెళ్లండి.
- ఫుల్ సెటిల్‌మెంట్, పెన్షన్ విత్ డ్రా లేదా పాక్షిక పీఎఫ్ విత్ డ్రాలో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి.
- మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఈపీఎఫ్ఓ నుంచి ఒక OTP వస్తుంది.
- విత్ డ్రా రిక్వెస్ట్ వెరిఫై కోసం OTPని ఎంటర్ చేయండి.
- క్లెయిమ్ సబ్మిట్ చేశాక ‘Track Claim Status’కు వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
